Tuesday, November 26, 2024

AP: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు బెయిల్

శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు బెయిల్ దక్కింది. 1996, డిసెంబర్‌ 29న దళితులకు శిరోముండనం కేసులో త్రిమూర్తులకు విశాఖలోని ప్రత్యేక కోర్టు జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బెయిల్ కోసం తోట త్రిమూర్తులు పిటిషన్ వేశారు. దీంతో ఆయనకు బెయిల్ వచ్చింది. ముద్దాయిలు అందరికీ బెయిల్ ఇస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. డాక్యుమెంట్ వర్క్ పూర్తి కాగానే కోర్టు నుంచి బయటకు రానున్నారు తోట త్రిమూర్తులు.

దళితులకు శిరోముండనం కేసులో విచారణ సుదీర్ఘకాలంగా కొనసాగింది. ఇందులో భాగంగా 24 మంది సాక్షులను విచారించారు. వారిలో 11మంది విచారణ సమయంలోనే మృతిచెందారు. శిరోముండనం జరిగిన 28 ఏళ్ల అనంతరం ఈ కేసులో విశాఖ కోర్టు తీర్పు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో త్రిమూర్తులు పాత్రను ప్రాసిక్యూషన్ నిరూపించింది. మొత్తం తొమ్మిది మందికి శిక్షలు ఖరారయ్యాయి. దోషులకు 18 నెలల జైలు శిక్షను కోర్టు విధించింది. ప్రస్తుతం మండపేట వైసీపీ అభ్యర్థిగానూ తోట త్రిమూర్తులు పోటీ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement