Friday, November 22, 2024

సన్యాసం స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే

రాజకీయాలంటే రుచి మరిగినోళ్లు అంత ఈజీగా అందులోంచి బయటకు రావు. పదవి కోసం అడ్డదారులు తొక్కేందుకు సైతం వెనకాడరు. మసిపూసి మారేడు కాయ చేసి అయిన సరే పదవి దక్కించుకోవాలనుకుంటారు. ఆశ్చర్యకర విషయమేటంటే రాజకీయాల్లో అడ్డదారులు తొక్కిన వారికే ఓట్లు వేసి పదవి కట్టబెడతారు ప్రజలు. కాని కొంత మంది మాత్రం నిజాయితీగా ప్రజసేవ చేస్తుంటారు కాని వారిని ఎవరు గుర్తించరు. కాని వారు మాత్రం చివరి వరకు ప్రజలకోసమే పోరాడుతుంటారు. అయితే మరికొంతమంది రాజకీయనాయకులుంటారు తాము అనుకున్నది చేయకపోతే రాజకీయ సన్యాసం తీసకుంటామని సపథం చేస్తుంటారు. కాని కడప జిల్లా బద్వేలు మాజీ ఎమ్మెల్యే మాత్రం ఎందుకు చేశారో ఏమో తెలియదు కాని సడెన్ గా రాజకీయ సన్యాసం ఏమో కాని నిజంగానే సన్యాసం తీసుకున్నారు. జీవితం మీద విరక్తి చెందో లేక రాజకీయాలంటే నచ్చకో ఏమో కానీ జీవితాన్ని మాత్రం సన్యాసానికి సమర్పించుకున్నాడు మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణరావు.

మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వి.శివరామకృష్ణారావు చివరిసారిగా 2001 ఉప ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గంలో కాంగ్రెస్​ నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి విజయమ్మ చేతిలో 58 వేల ఓట్లతో ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా.. ఎన్నికలకు దూరంగా ఉంటూ వచ్చారు. వృత్తిరీత్యా ఆయన వైద్యుడు. కానీ ఇప్పుడు కారణాలు చెప్పకుండానే ఆయన సన్యాసం స్వీకరించారు. సన్యాసిగా కనిపిస్తున్న ఆయన ఫొటో ఇప్పుడు నెట్టింటా హాట్ టాపిక్‌గా మారింది. ఓ పొలిటికల్ లీడర్ ఏకంగా సన్యాసం తీసుకోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వి.శివరామకృష్ణారావు 1978లో జేఎన్‌పీ నుంచి, 1989లో కాంగ్రెస్​ నుంచి గెలిచారు. మొదటిసారి 44 వేల మెజార్టీతో, రెండోసారి 60 వేల మెజార్టీతో గెలిచారు. అదేవిధంగా 1972లో, 1983లో, 1985లో, 1994లో, 1999లో కాంగ్రెస్​ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. శివరామకృష్ణరావు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేత…రాజకీయాల నుండి వైదొలిగి సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన ఇప్పుడు శివరామకృష్ణారావు శివరామానంద సరస్వతిగా మారారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement