Wednesday, October 23, 2024

Badvel – పెట్రో దాడి బాధిత కుటుంబానికి చంద్ర‌బాబు ప‌రామ‌ర్శ‌

క‌లెక్ట‌ర్ చేతుల మీదుగా రూ.10 ల‌క్ష సాయం అంద‌జేత‌
విద్యార్ధిని త‌ల్లిని ఓదార్చి ధైర్యం చెప్పిన సిఎం
ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిందితుడ్ని క‌ఠినంగా శిక్షిస్తామ‌ని హామీ .

బద్వేలు: వైఎస్‌ఆర్‌ జిల్లా బద్వేలులో పెట్రోల్‌ దాడికి గురై మృతి చెందిన ఇంటర్‌ విద్యార్థిని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఆమె కుటుంబానికి సీఎం చంద్రబాబు రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ నేప‌థ్యంలో జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ అదితి సింగ్‌, టిడిపి నేత శ్రీనివాసరెడ్డి చెక్కును బాధిత కుటుంబ స‌భ్యుల‌కు నేడు అందజేశారు. ఈ సంద‌ర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. విద్యార్థిని తల్లిని ఓదార్చారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. నిందితుడిని అరెస్టు చేశారని.. కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరుపుతామని చెప్పారు. బాలిక సోదరుడి చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఆమె తల్లికి ఉపాధి కల్పించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement