Saturday, November 23, 2024

బద్వేలు ఉపఎన్నిక: ప్రారంభమైన ఓట్ల లెక్కింపు.. ఫలితాలపై టెన్షన్

కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. బద్వేలులోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు అనంతరం ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఇందుకోసం బాలయోగి గురుకుల పాఠశాలలో 4 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 7 టేబుళ్ల చొప్పున 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 10 లేదా 12 రౌండ్లలో మొత్తం ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గెలిచిన వారు విజయోత్సవాలు జరుపుకోవద్దని పోలీసుల ఇప్పటికే ఆదేశించారు.

వైసీపీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతితో బద్వేలు స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. అక్టోబర్ 30న ఉపఎన్నిక జరిగింది. ఉపఎన్నికలో అధికార వైసీపీ నుంచి సుధ, బీజేపీ నుంచి పనతల సురేష్, కాంగ్రెస్ నుంచి కమలమ్మ పోటీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement