Monday, January 6, 2025

Krishna | ఇంద్రకీలాద్రిపై అధ్వానంగా పారిశుధ్యం.. ఇన్చార్జి ఈవో ఆగ్ర‌హం

  • భక్తులకు ఇలాగేనా స్వాగతం పలికేది…
  • పారిశుధ్య నిర్వహణపై ఇన్చార్జి ఈవో ఆగ్రహం…
  • క్యూలైన్లు, అంతరాలయం పలు ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీ…
  • ఇంద్రకీలాద్రిపై అధ్వానంగా పారిశుధ్య నిర్వహణ…
  • కనీసం పట్టించుకోని సిబ్బంది తీరుపై ఆక్షేపణ…
  • పర్యవేక్షణ లేదంటూ అధికారులకు తలంటు…
  • ఈవో ఆగ్రహంతో రంగంలోకి దిగిన అధికారులు, సిబ్బంది…
  • హుటా హుటిన పారిశుద్ధ్యం, బూజు దులుపుతున్న కార్మికులు


(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : నిత్యం వేల సంఖ్యలో అమ్మవారి దర్శనానికి పవిత్ర హృదయంతో వచ్చే భక్తులకు ఇలా స్వాగతం పలుకుతున్నారా అంటూ ఇన్చార్జి ఈవో రామచంద్ర మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని క్యూలైన్లు, ప్రధాన ఆలయంతో పాటు పలు ప్రాంతాలను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యూలైన్లు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన క్యూలైన్ లో అపరిశుభ్రంగా ఉన్న పరిస్థితులను చూసి ఆశ్చర్యపోయారు.

క్యూలైన్ లో ఎక్కడి చెత్త అక్కడే ఉండడం, భక్తులు నడిచే ప్రాంతాలలో ఇనుప రాడ్లు, ఇతర వస్తువులతో పాటు, బూజు పట్టిపోయి ఉన్న గోడలు ఫ్యాన్లను చూసి సిబ్బంది, ఇతర అధికారులను పిలిపించి ప్రశ్నించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఈ రీతిలో మీరు స్వాగతం పలుకుతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపై పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉండడం దారుణమని, సిబ్బంది పనితీరు ఎలా ఉంటే అధికారుల సైతం పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుందని అధికారులకు అక్షింతలు వేశారు. పై స్థాయి అధికారులు కూడా పట్టించుకోకపోవడం పట్ల ఇన్చార్జి ఈ ఓ రామచంద్ర మోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న అన్ని ప్రాంతాలలో పూర్తిస్థాయిలో పరిశుభ్ర వాతావరణ ఉండాలని, తక్షణమే దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈఓ ఆగ్రహంతో రంగంలోకి సిబ్బంది…
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ప్రధానాలయం క్యూలైన్లతో పాటు ఇతర ప్రాంతాల్లో శనివారం ఆకస్మికంగా పర్యటించిన ఇన్చార్జి ఈవో రామచంద్ర మోహన్ సిబ్బంది అధికారులపై పారిశుద్ధ్య నిర్వహణ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పారిశుద్ధ కార్మికులు సిబ్బంది అధికారులకు రంగంలోకి దిగారు. ప్రధాన ఆలయం క్యూలైన్లతో పాటు రాజగోపురం, ఘాట్ రోడ్డు, సమాచార కేంద్ర పరిసర ప్రాంతాలలో బూజు దులపడం, పెరిగిన పిచ్చి మొక్కలను తీయడంతో పాటు, అస్తవ్యస్తంగా ఉన్న ఇనుప రాడ్లు, వైర్లను సరి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇన్చార్జి ఈవో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఉన్నతాధికారులకు తలంటడంతో చేరుకున్న వీరు పారిశుద్ధ్య పనులు ఇంద్రకీలాద్రిపై ముమ్మరం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement