అమరావతి,ఆంధ్రప్రభ:ఉన్నత విద్యా రంగంలో గత మూడేళ్ల నుండి జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఓ నిశ్శబ్ద విప్లవం చోటు చేసుకుంటున్న ట్లుగా కనిపిస్తోంది. ఉన్నత విద్యా కోర్సుల్లో చేరే వారి సంఖ్య రాష్ట్రంలో గణనీ యంగా పెరగగా ముఖ్యంగా బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన విద్యార్ధుల సంఖ్య భారీగా పెరిగింది. దీనికి ముఖ్య కార ణం ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్యా రంగంపైన ఖర్చు చేస్తుం డడమే. రాష్ట్రంలోని వైఎస్ జగన్ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కార్యక్రమాల ద్వారా ఏడాదికి దాదాపు 12,400 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. దీంతో 40 లక్షల మంది విద్యార్ధులు లబ్ది పొందుతున్నారు. తమకు ఆర్ధికంగా శక్తి లేకపో యినా ప్రభుత్వం ఆపన్న హస్తం అందించడంతో పెద్ద సంఖ్యలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మహిళా వర్గాలకు చెందిన విద్యార్ధులు ఉన్నత విద్యా కోర్సుల్లో చేరుతున్నారు.
అఖిల భారత స్థాయి కన్నా చాలా ముందుకు
ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి 2018-19తో పోల్చుకుంటే 2020-21 ఏడాదిలో భారత దేశ సగటు కన్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చాలా ఎక్కువగా ఉంది. ఓవరాల్‌గా భారత్ దేశం ఈ రెండేళ్లలో 3.8 శాతం అభివృద్ది రేటు సాధిస్తే ఆంధ్ర ప్రదేశ్ 14.81 శాతం వృద్దిరేటు సాధించింది. పురుషుల విభాగంలో ఇండియా అభి వృద్ది రేటు 1.52 శాతం కాగా అదే ఎపి గ్రోత్ రేటు 6.98 శాతం పెరిగింది. అదే మహి ళల విభాగంలో ఎపి అభివృద్ది రేటు చాలా అధికంగా ఉంది. అఖిల భారత స్థాయిలో 5.68 శాతం ఉండగా ఎపిలో మాత్రం 24.13 శాతం పెరిగింది. ఎస్‌సి కేటగిరిలో అఖిల భారత స్థాయిలో 0.43 శాతం మాత్రమే ఉండగా రాష్ట్రంలో మాత్రం 16.26 శాతం ఉంది. ఇక ఎస్‌టిల కేటగిరిలో అఖిల భారత స్థాయిలో 9.88 శాతం వృద్దిరేటు ఉండగా ఎపిలో మాత్రం 20.45 శాతం వృద్దిరేటు సాధించారు. ఇక ఎపిలో వరకు మాత్రమే చూసినా ఓవరాల్‌గా 2018-19 ఏడాదిలో 32 శాతం వృద్ది రేటు ఉండగా 2020-21లో 37.2 శాతం వృద్ది రేటు ఉంది. ఇక మహిళల విభాగంలో 29 శాతం నుండి 36 శాతానికి పెరగగా ఎస్‌సిలలో 28 శాతం నుండి 33 శాతా నికి, ఎస్‌టిలలో 26 శాతం నుండి 32 శాతానికి పెరిగింది. 2021-22 ఏడాదిలోనూ గత ఏడాదితో పోలిస్తే ఓవ రాల్‌గా 13 శాతం , మహిళలల్లో 16.35 శాతం, ఎస్‌సిల్లో 18 శాతం, ఎస్‌టిలో 9.93 వబుూతం, ఎస్‌సిలలో 13 శాతం పెరుగుదల ఉంది.
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో పెరుగుతున్న చేరికలు
ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ కానీ, ఫార్మసీ గాని ఇలా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య గత మూడేళ్లలో గణనీయంగా పెరిగింది. 2018-19 ఏడాదిలో ఇంటర్ పాసయి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరిన వారు పురుషుల్లో 95 శాతం మంది ఉండగా మహిళలల్లో 80 శాతం మంద ఉన్నారు. అదే 2022-23 ఏడాదిలో పురుషులు 97.78 శాతం మంది ఉండగా మహిళలు 89.55 శాతం మంది దాకా పెరిగారు. ఇంటర్ తర్వాత డిగ్రీ కోర్సుల్లో చేరని వారి సంఖ్య 2018-19 ఏడాదిలో 20 శాతం ఉండగా, 2022-2023 నాటికి ఆరు శాతానికి పడిపోయింది. ఉన్నత విద్యపై ప్రభుత్వం పెడుతున్న భారీ ఖర్చులో కారణంగానే ఈ కోర్సుల్లో చేరే బలహీనవర్గాల సంఖ్య పెరుగుతోందని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు.