కర్నూల్ బ్యూరో : ఆదోనిలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాలనీకి చెందిన నవీన్ (20) అనే బీటెక్ విద్యార్థి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఇవాళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నవీన్ బీటెక్ పరీక్షల్లో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. దీంతో తన గదిలో ఉరివేసుకున్నాడు. ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
- Advertisement -