Saturday, November 23, 2024

వైఎస్ వివేకా హత్య కేసు.. ఎంపీ అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు?

ఆంధ్రప్రదేశ్ లో సంచలన రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలని టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్ రవి ప్రశ్నించారు. దస్తగిరి వాగ్మూలం ప్రకారం దేవిరెడ్డి శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.. వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఎందుకు వారిపై చార్జిషీట్ దాఖలు చేయడం లేదని నిలదీశారు. రెండవ చార్జిషీట్ లో 5వ నిందితుడిగా దేవిరెడ్డి శంకర్ రెడ్డిని చేర్చారని అన్నారు. దేవిరెడ్డి శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసి 80వ రోజులైనా ఎందుకు అవినాష్, భాస్కర్ రెడ్డి లను అరెస్ట్ చేయరని అడిగారు. సామాన్యులకైనా రాజకీయ నాయకులకైనా ఒకటే న్యాయం ఉండాలన్నారు. సీఎం డిల్లీకి వెళ్ళి వచ్చాకే కేసు విచారణ నెమ్మదిగా సాగుతోందని అరోపించారు. ఇది పులివెందుల ప్రజల్లో చర్చ సాగుతోందని తెలిపారు. కేసును నీరుగార్చేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ మోడీని మోకరిల్లుతున్నారని ఆరోపించారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేకా హత్య పై అనుమానం వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్.. సీఎం అయ్యాక సీబీఐ విచారణ వద్దని ఎందుకు వెనక్కి తీసుకున్నారని ప్రశ్నించారు. దీనిపై పలు అనుమానాలు ఉన్నాయి చెప్పారు. వివేకా కుమార్తె ప్రాణహాని ఉదంటూ చెప్పిదంటే జగన్ కుటుంబ సభ్యులకే భద్రత లేనప్పుడు ఇక రాష్ట్రంలో ఎవరికి భద్రత ఉంటుందిని విమర్శించారు. వైఎస్ మరణాన్ని హత్యగా ఆరోపించిన విజయమ్మ,జగన్ లు ఇప్పుడెందుకు యూటర్న్ తీసుకున్నారని నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు చిన్నానను చంపిన వ్యక్తికి టికెట్ ఇచ్చి ఎంపీగా ఎందుకు చేశారన్నారు. రాజకీయ లబ్ది కోసమే జగన్ ఇలాంటి కుట్రలు, కుయుక్తులు చేస్తున్నారని అరోపించారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను తప్పించేందుకు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు. సీబీఐ అధికారులు ఆరోపణలు ఉన్న వ్యక్తులపై చార్జిషీట్ దాఖలు చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement