Friday, November 22, 2024

ఘనంగా ఆజాదీగా అమృత్‌ మహోత్సవ్‌.. ఆకట్టుకున్న ఫొటొ ఎగ్జిబిషన్‌

కర్నూలు ప్రతినిధి, (ప్రభన్యూస్‌) : కొండారెడ్డి బురుజు వద్ద శనివారం ఆజాదీ కా అమృత్‌ మహాత్సవ్‌ ”హర్‌ ఘర్‌ తిరంగ ” కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు టూరిుజ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు- చేసిన దేశభక్తి, చారిత్రక అంశాలకి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్‌కు ప్రజల నుండి విశేష ఆకర్షణ లభిస్తున్నదని పర్యాటక శాఖ అధికారి బి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలందరికీ దేశభక్తి పెంపొందించేలా ఆజాదీ కా అమృత్‌ మహాత్సవ్‌ ”హర్‌ ఘర్‌ తిరంగ ” కార్యక్రమంలో భాగంగా దేశభక్తి, చారిత్రక అంశాలపై ఫోటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు- చేయడం సంతోషంగా ఉందన్నారు. తొలుత మన జిల్లా స్వాతంత్య్ర సమరయోధుడు అమరవీరుడైన సర్దార్‌ నాగప్ప కుమారుడు సర్దార్‌ బుచ్చిబాబు కుటు-ంబ సభ్యుల సమేతంగా ఫోటో ఎగ్జిబిషన్‌ ను తిలకించారని పేర్కొన్నారు.

అదే విధంగా ఫోటో ఎగ్జిబిషన్‌ తిలకించడానికి వచ్చిన కె వి ఆర్‌ కళాశాల విద్యార్థులను ఉద్దేశించి కర్నూలు జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రదేశాలు, దేవాలయాలు అలాగే స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు. అలాగే ఆజాదీ కా అమృత్‌ మహాత్సవ్‌ ”హర్‌ ఘర్‌ తిరంగ ” కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు 11 వ తేదీన ఉదయం 10.30 గంటలకు పురావస్తు, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పాఠశాల కళాశాల విద్యార్థుల చేత నిర్వహించే హెరిటేజ్‌ వాక్‌ పాత కంట్రోల్‌ రూమ్‌ నుండి కొండారెడ్డి బురుజు వరకు నిర్వహించడం జరుగుతుందని ఇందులో జిల్లా కలెక్టర్‌ పాల్గొంటారని తెలియచేశారు. కార్యక్రమంలో కేంద్ర పురావస్తు శాఖ కన్సర్వేటివ్‌ అసిస్టెంట్‌ దాకా రెడ్డి, కె వి ఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఇందిర శాంతి, లెక్చరర్స్‌, పర్యాటక శాఖ సిబ్బంది మరియు కె వి ఆర్‌ కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement