అనంతపురం ఆగస్టు 14 – అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నా భూమి-నా దేశం అను నినాదంతో వసుధకు వందనం కింద నిర్వహించిన నేలతల్లికి నమస్కారం, వీరులకు వందనం కార్యక్రమంలో భాగంగా శిలాఫలకం ఆవిష్కరించారు జిల్లా ఇంచార్జి మంత్రి , రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి డా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ యం. గౌతమి, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరి సాంబశివారెడ్డి, ఎడిసిసి బ్యాంకు చైర్ పర్సన్ లిఖిత, నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్లు కోగటం విజయ భాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నాలుగు అసెంబ్లీ నియోజవర్గాల సమీక్షా సమావేశం
అనంతపురంలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశానికి హాజరయ్యారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో కొనసాగుతున్న పనులు నిధులు ఇతర అంశాలపై చర్చించారు. రాయదుర్గం ఉరవకొండ అనంతపురం సింగనమల అధికారులు ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్పటికీ మూడు నియోజకవర్గాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించామన్నారు..ప్రాధాన్యత క్రమంలో పనులు అన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. 90 శాతం పనులు పూర్తయిన అంశాల పై దృష్టి సారించాలని కోరారు. త్వరితగతిన పూర్తి చేయగలిగిన పనులు రెండో ప్రాధాన్యత లో పూర్తి చేయాలన్నారు. అధికారులకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని,
ప్రతి అధికారి నిబద్దతతో పనులు పూర్తి చేయాలని కోరారు..