Thursday, October 24, 2024

AP | సైబర్ నేరాలపై అవగాహన ముఖ్యం : సీపీ రాజశేఖర్

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయని, నేరాలు జరిగిన తరువాత దర్యాప్తు చేసేకంటే, అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు.

సైబర్ నేరాల నియంత్రణ అవగాహన కోసం పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు పర్యవేక్షణలో క్రైమ్ డి.సి.పి. తిరుమలేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ల సిబ్బందితో కలిసి పోలీస్ కమీషనరేట్ పరిదిలో డిజిటల్ అరెస్ట్, సైబర్ నేరాలను అరికట్టి ప్రజలందరిని సైబర్ సిటిజన్స్ గా తయారు చేయాలనే లక్ష్యంతో బృహత్తర ప్రణాలికను సిద్ధం చేయడం జరిగింది.

దీనిలో బాగంగా పోలీస్ కమిషనర్ కార్యాలయం లో కమీషనరేట్ పరిదిలోని అన్ని బ్యాంకుల అధికారులతో పోలీస్ కమీషనర్ కో-ఆర్డినేషన్ మీటింగ్ ను గురువారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ….

ఎన్టిఆర్ జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిదిలో సైబర్ నేరాలపై ప్రజలలో భారీ ఎత్తున అవగాహన కల్పించి ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చేందుకు వినూత్న పద్దతిలో ముందుకు పోవడానికి సైబర్ కమాండోలను, సోల్జర్స్ లను ఏర్పాటు చేస్తామ‌న్నారు.

వారి ద్వారా వారి ఏరియాలోని ప్రజలకు సైబర్ నేరాలు ఏవిధంగా జరుగుతాయి, సైబర్ నేరానికి గురికాకుండా ఉండాలంటే ఏ ఏ జాగత్ర్తలు తీసుకోవాలి? నేరం జరిగిన పక్షంలో ఏ విధంగా 1930 కు ఫిర్యాదు చెయ్యాలి? ఫిర్యాదు సమయంలో దర్యాప్తు అధికారులకి సమర్పించాల్సిన ఆధారాలు ఏమిటి వాటిని ఎలా సేకరించాలి? మొదలగు విషయాలపై ప్రజలను చైతన్య పరిచి వారిని సైబర్ సిటిజన్స్ గా మార్చడం జరుగుతుందని తెలిపారు.

- Advertisement -

అదేవిధంగా ఈ మధ్యకాలంలో అత్యధికంగా సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో అధికారులుగా నటిస్తూ నకిలీ ఎస్ఎంఎస్ లు వీడియో కాలు ద్వారా కస్టమర్లను భయబ్రాంతులకు గురి చేసి వారు మాదకద్రవ్యాలు, మనీలాండరింగ్ కేసుల్లో వారి ప్రేమేయం ఉన్నట్లు నమ్మించి అమాయకులను మోసం చేస్తున్నారు. ఆపరాద రుసుము చెల్లించమని బెదిరించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయిస్తున్నారని, దీనిలో బాగంగా బ్యాంకర్స్ సహకారం అవసరం అని, సైబర్ నేరాల నివారణలో బాగంగా త్వరితగతిన విచారణ చేపట్టడం జరుగుతుందని అన్నారు.

ఈ క్రమంలో ఏమైనా సలహాలు ఉంటే తెలియజేయమని, ఈ కార్యక్రమంలో బ్యాంకర్లు అందరూ బాగస్వాములు కావాలని, ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇటువంటి నేరాలు జరుగకుండా నిరోధించగలం అనే విషయంపై నగరం లోని అన్ని బ్యాంకు అధికారులతో కులంకుషంగా చర్చించారు.

ఈ క్రమంలో బ్యాంకు అధికారులకు కొన్ని ముఖ్యమైన సూచనలు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ డి.సి.పి. తిరుమలేశ్వర రెడ్డి, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది, నగరంలోని అన్ని బ్యాంకుల నుండి సుమారు 120 అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement