కడప, బ్యూరో ప్రభన్యూస్ వైయస్ వివేకా హత్యకేసు లో విచారణ కు హాజరు కావాలని సిబిఐ నోటీసులు జారీచేసిన తరుణంలో కడప ఎంపి వైయస్ అవినాష్ రెడ్డి ఈరోజు ఉదయం ఐదు గంటలకే హైదరాబాద్ బయలుదేరిన వెళ్ళారు. కేసు విచారణ మరింత వేగం పెంచిన సిబిఐ ఆదివారం అవినాష్ రెడ్డి తండ్రిని అరెస్ట్ చేసింది.అదేరోజు సాయంత్రం అవినాష్ రెడ్డి కి సోమవారం హైదరాబాద్ లో సిబిఐ విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది.ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు ఉదయమే పులివెందుల నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్ళారు
.ఇప్పటికే నాలుగు సార్లు విచారణ ఎదుర్కొన్న అవినాష్ రెడ్డి మరోసారి సిబిఐ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది.సాయంత్రం 3 గంటలకు హాజరు కావాలని సిబిఐ నోటీసులో పేర్కొంది.దీంతో హైదరాబాద్ బయలుదేరారు,ఆయనతో పాటు సుమారు 10 వాహనాల్లో అనుచరులు బయలు దేరారు.నిన్నటి రోజు ఆయన తండ్రి నా అరెస్ట్ చేసిన తరుణంలో ఈ రోజు విచారణకు హాజరు కానున్న అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశే అవకాశాల ఉన్నాయన్న ఆందోళన వైసిపిలో కనిపిస్తోంది.