కర్నూలు – ఒకవైపు వివేకా హత్య కేసులో ఎంపి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిబిఐ రంగం సిద్దం చేసుకుంటుంటే మరో వైపు తాను అరెస్ట్ కాకుండా అవినాష్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు.. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంలో పిటిషన్ ను అవినాష్ లాయర్లు వేయనున్నారు.. ఈరోజే విచారణకు వచ్చేలా న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు.. మరోవైపు అవినాష్ సిబిఐ అడిషనల్ ఎస్పీకి ఒక లేఖ రాశారు.. విచారణకు హాజరయ్యేందుకు తనకు వారం రోజులు గడువుకావాలని అందులో కోరారు.. అలాగే తన తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆమెను చూసుకోవలసిన బాధ్యత తనపైనే ఉందని పేర్కొన్నారు.. తన తండ్రి అరెస్ట్ కావడంతో తన తల్లి వద్ద తానే ఉండాల్సిన పరిస్ధితిని ఆయన తన లేఖలో వివరించారు.. ఇది ఇలా ఉంటే కర్నూలు హాస్పటల్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.. బారికేడ్లతో ఆ మార్గాన్ని దిగ్భందించారు.. లోపలికి ఎవరిని వదలడం లేదు.. ఇదే సమయంలో వైసిపి శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు.. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ అదుపులోనే ఉందని పోలీసులు వెల్లడించారు.
Avinash Reddy – ముందస్తు బెయిల్ కు సుప్రీంలో పిటిషన్ – వారం గడువు కోరుతూ సిబిఐకి లేఖ..
Advertisement
తాజా వార్తలు
Advertisement