Monday, November 18, 2024

ఇన్ని ట్విస్టులా అవినాష్ రెడ్డి – కర్నూలులో ఎంపి తల్లికి చికిత్స.

క‌ర్నూల్ : నేటి ఉదయం అస్వస్థతకు గురైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మిని చికిత్స కోసం కర్నూల్ లోని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు.అంతకు ముందు హైదరాబాద్ కు అంబులెన్స్లో బయలుదేరిన ఆమెను అనంతపురం జిల్లా తాడిపత్రిలో పరామర్శించి అదే అంబులెన్స్ లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హైద్రాబాద్ కు బయలుదేరారు. అయితే మార్గమధ్యలోఆమను కర్నూల్ లోని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు. కర్నూల్ ఆసుపత్రి వైద్యులు వైఎస్ లక్ష్మికి చికిత్స అందిస్తున్నారు. తల్లితో పాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు. శుక్ర‌వారం కావ‌డంతో వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి ఉప‌వాస దీక్ష‌లు ఉన్నాయి.. ఉదయం నుంచి ఏమీ తీసుకోక‌పోవ‌డంతో అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో కళ్తు తిరిగి పడిపోవడంతో పులివెందులలోని దినేష్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఆసుపత్రిలో చికిత్స అందించిన తర్వాత ఆమెను మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్ కు తరలించాల‌ని వైద్య‌లు నిర్ణ‌యించారు..

ఇది ఇలాఉంటే నేడు సిబిఐ విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరిన సమయంలో తల్లికి అనారోగ్యం గురించి కడప ఎంపీకి సమాచారం అందింది. దీంతో వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కాకుండా పులివెందుల బయలుదేరారు. తల్లికి అనారోగ్యం గురించి సీబీఐ అధికారులకు వైఎస్ అవినాష్ రెడ్డి లాయర్లు సమాచారం ఇచ్చారు. ఇవాళ మధ్యాహ్నం అనంతపురం జిల్లా తాడిపత్రిలో తల్లి వస్తున్న అంబులెన్స్ అవినాష్ రెడ్డికి ఎదురైంది. అక్కడే తల్లిని అవినాష్ రెడ్డి ఆమెను పరామర్శించారు. అదే అంబులెన్స్ లో తల్లితో పాటు కర్నూల్ విశ్వభారతి ఆసుపత్రికి వైఎస్ అవినాష్ రెడ్డి చేరుకున్నారు.
వైయస్సార్సీపి ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి కి కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో తల్లి వెంటే ఉన్న అవినాశ్ రెడ్డి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లడంపై నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement