Friday, September 20, 2024

అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం – కార్డియోలాజిస్ట్ హితేష్ రెడ్డి

కర్నూలు…. అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం పై కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ ప్రెస్ రిలీజ్ చేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు విశ్వ బారతి హాస్పటల్ కార్డియోలాజిస్ట్ హితేష్. రెడ్డి సోమవారం ఉదయం తెలిపారు. ఆమెకు నాన్ ST ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (హార్ట్ అటాక్) ఉన్నట్ల్లు వివరించారు.ఆమె యాంజియోగ్రామ్ డబుల్ నాళాల వ్యాధితో బాధపడుతున్న ట్లు పేర్కొన్నారు. ఆమె మా వైద్యుల బృందం పర్యవేక్షణలో CCUలో ఉందన్నారు. ఆమెకు ఇప్పటికే రక్తపోటు తక్కువగా ఉందని, అయానోట్రోపిక్ సపోర్ట్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమెకు వాంతులు వచ్చాయి,ఆమె నోటి నుంచి ఆహరం తీసుకోవడం తగ్గింది. వాంతులు కొనసాగితే, మేము అల్ట్రాసౌండ్ ఉదరం,మెదడు యొక్క ఇమేజింగ్ ప్లాన్ చేస్తున్నట్లు వైద్యలు తెలిపారు. ఆమెకు బిపి తక్కువగా ఉన్నందున మరికొన్ని రోజులు ఐసియులో ఉండవలసి ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement