హైదరాబాద్ – వివేకానంద హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపి అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.. ఈ బెయిల్ పిటిషన్ పై నేడు సిబిఐ, అవినాష్ న్యాయవాదుల మధ్య వాదోపవాదాలు జరిగాయి.. ముందుగా అవినాష్ తరుపు న్యాయవాదులు తమ వాదనలను అయిదున్నర గంటల పాటు వాదించారు.. ఈ కేసులో కీలకమైన వాచ్ మెన్ రంగయ్య వాగ్మూలాన్ని సిబిఐ సరిగా తీసుకోలేదంటూ వాదించారు..అతడి నుంచి వివరాలు సేకరించేందుకే సిబిఐ ఒకటిన్న సంవత్సరం వృదాచేసిందన్నారు..
దీంతో ఈ వాగ్మూలం వివరాలను ఇవ్వాలని సిబిఐని హైకోర్టు కోరింది.. ఇక గుండెపోటు అని చెప్పడం నేరం కాదంటూ అవినాష్ న్యాయవాదులు వాధించారు.. అప్పటికి ఉన్న సమాచారాన్ని మాత్రమే అవినాష్ పంచుకున్నారని విన్నవించారు.. ఇది కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి కోసం జరిగిన హత్యేనని, రాజకీయ ప్రేరేపిత హత్య కాదంటూ అవినాష్ లాయర్లు వాధించారు.. సిబిఐ ఛార్జిషీల్ లోనూ అవినాష్ ను నిందితుడిగా పేర్కొనలేదని గుర్తు చేశారు.. తల్లి అనారోగ్యం కారణంగానే సిబిఐ విచారణ వాయిదా కోరారని తెలిపారు.. అనంతరం సునీతా రెడ్డి తరుపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.. సకాలంలో సిబిఐ విచారణకు హాజరుకాకుండా అవినాష్ తప్పించుకు తిరుగుతున్నారని, దీనివల్ల కేసు విచారణ మరింత ఆలస్యం అవుతుందని వివరించారు.. ఇక సిబిఐ వాదనలను రేపే వింటామంటూ హైకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది..