Home ఆంధ్ర‌ప్ర‌దేశ్ AP | నేటి నుంచి అందుబాటులో.. రాజమండ్రి నుంచి ఢిల్లీకి విమాన స‌ర్వీస్ లు

AP | నేటి నుంచి అందుబాటులో.. రాజమండ్రి నుంచి ఢిల్లీకి విమాన స‌ర్వీస్ లు

0
AP | నేటి నుంచి అందుబాటులో.. రాజమండ్రి నుంచి ఢిల్లీకి విమాన స‌ర్వీస్ లు

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం – రాజమండ్రి నుంచి ఢిల్లీకి వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఇండిగో ఎయిర్ లైన్స్ ఇవాళ రాజమండ్రి నుంచి ఢిల్లీకి డైరెక్ట్ విమాన సర్వీసును ప్రారంభించింది. రాజమండ్రి మధురపూడి ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టుకు ఇకపై నేరుగా విమానాలు నడవబోతున్నాయి. ఇక నేటి ఉంద‌యం ఢిల్లీ నుంచి రాజమండ్రికి వచ్చిన మొదటి ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ పురందేశ్వరి చేరుకున్నారు.

రన్‌వే పై ల్యాండ్ అయిన ఇండిగో ఎయిర్ బస్‌కు వాటర్ కెనాల్స్‌తో సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం రాజమండ్రి నుంచి ఢిల్లీ డైరెక్ట్ ఫ్లైట్ ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లింది. కాగా రోజూ రెండు స‌ర్వీస్ లు అందుబాటులోకి వ‌చ్చాయి.. ఉద‌యం తొమ్మిది గంట‌ల‌కు, రాత్రి 7 గంట‌ల‌కు ఈ విమానాలు రాజ‌మండ్రి విమానాశ్ర‌యం నుంచి బ‌య‌లుదేర‌నున్నాయి.. రాజ‌మండ్రి నుంచి ఢిల్లీకి టికెట్ ధ‌ర రూ. 5500గా నిర్ణ‌యించారు.

ఇదిలా ఉంటే రాజమండ్రి ఎంపీగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో ఇండిగో సంస్ధతో మాట్లాడి ఈ డైరెక్ట్ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం రాజమండ్రి నుంచి ఢిల్లీ వెళ్లాలంటే విశాఖకో, విజయవాడకో వెళ్లి ఎక్కుతున్న వారంతా ఇకపై నగరం నుంచే రాకపోకలు సాగించనున్నారు.

Exit mobile version