Friday, November 22, 2024

విభజన పర్వం.. చకచకా అడుగులు : ఉత్తర్వుల కోసం ఉద్యోగులు ఎదురుచూపు

నంద్యాల, ప్ర‌భ‌న్యూస్ : జిల్లాలో పునర్విభజన ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. నంద్యాల, కర్నూలు రెండు జిల్లాల భౌగోళిక స్వరూపం, ప్రణాళిక విభాగం అధికారులు సిద్దం చేయగా, ఇప్పటికే భవనాల ఎంపిక కూడా పూర్తయింది. ఉద్యోగుల సర్దుబాటుపై ఉన్నతాధి కారుల ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నారు. శాఖల వారిగా ఆస్తులు, మౌళిక వసతులపై కూడా కసరత్తు పూర్తిచేశారు. కలెక్టర్‌ కోటేశ్వరరావ్‌, ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్లు రామ్‌సుందర్‌రెడ్డి, డాక్టర్‌ మనిజీర్‌ జిలానీ సమూన, శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఇప్పటికే కర్నూలు, నంద్యాల జిల్లాకు సంబంధించి సర్వం సిద్ధం చేశారు.

ఈ జిల్లా 9వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండనుంది. మూడు రెవెన్యూ డివిజన్లు, 27 మండలాలు, 26 మండల పరిషత్‌లు, 454 గ్రామ పంచాయతీలు, 417 గ్రామాలు, ఐదు మునిసిపాలిటీలు, ఒక నగర పంచాయతీ, 145 వార్డులు, 102 సచివాలయాలు, 3.37లక్షల హెక్టార్ల సాగుభూమి, 3,10678 హెక్టార్ల అటవీ విస్తీర్ణం, ఖనిజ సం పద 43లక్షలు, 16,87,554లక్షల జనాభా, అందులో ఎస్సీకి సంబంధించి 3,23,348, ఎస్టీ 47,917, 56శాతం అక్షరాస్యత ఉన్నట్లు గుర్తించారు. తాగునీటి ప్రాజెక్టులన్నీ నంద్యాల జిల్లాలోనే ఉన్నాయి. డోన్‌, బేతంచెర్లలో నాపరాయి. లైమ్‌స్టోన్‌ వంటి ఖనిజ సంపద ఎక్కువగా ఉన్నాయి. శ్రీశైలం, అహోబిలం, మహానంది, యాగంటి, బెలుంగుహలు, రోళ్లపాడు వంటి పర్యాటక స్థలాలు కొత్త జిల్లా పరిధిలోనే ఉన్నాయి. బనగానపల్లె, కొలిమిగుండ్లలోని సిమెంట్‌ పరిశ్రమలు నంద్యాలకే ఉన్నాయి. విద్యుత్‌ ఉత్పత్తి శ్రీశైలం కుడిగట్టు కొత్త జిల్లాకే ఉంది.

ఉత్తర్వుల కోసం ఎదురుచూపులు..

నంద్యాల జిల్లాకు సంబంధించి ఉద్యోగుల నియామకానికి ఆ జిల్లాకు సంబంధించిన ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని కొంతమంది ఎదురుచూస్తుండగా, మరికొంతమంది అసంతృప్తితో ఉన్నారు. ఈనెల 25న ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు రెవెన్యూ కార్యాలయ వర్గాల ద్వారా తెలిసింది.

జిల్లాలో 117 మంది ఉద్యోగులు..

- Advertisement -

జిల్లాలోని రెవెన్యూ విభాగంలో పని చేసే ఉద్యోగుల జాబితాను సీసీఎల్‌ఏ అధికారులకు బుధవారం ప్రత్యేకంగా నివేదించారు.
కర్నూల్‌ కలెక్టరేట్‌ కు సంబంధించి జిల్లా రెవెన్యూ అధికారి కలెక్టరేట్‌ పరిపాలన అధికారి తోపాటు- వివిధ సెక్షన్ల సూపరిం-టెండెంట్‌లు, ఇతరులు మొత్తం 77 మంది పనిచేస్తున్నారు. ఆదోని రెవెన్యూ డివిజన్‌ పరిధిలో రెవెన్యూ డివిజన్‌ అధికారి తోపాటు, పరిపాలన అధికారి, ఇతర సంబంధించి 13 మంది ఉద్యోగుల వివరాలు పొందుపరిచారు. కర్నూల్‌ రెవెన్యూ డివిజన్‌ కేంద్రంలో రెవిన్యూ డివిజనల్‌ అధికారి తోపాటు, పరిపాలన అధికారిని, ఇతర విభాగాల నుంచి 12 మంది వివరాలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement