Thursday, November 21, 2024

AP | 30న బార్లకు వేలం.. నోటిఫికేషన్‌ జారీ చేసిన ఎక్సైజ్‌ శాఖ

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని పన్నెండు బార్లకు రెండేళ్ల కాలపరిమితితో ఎక్సైజ్‌ు శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 30న ఆన్‌లైన్‌ విధానంలో హెచ్చు పాటదారులకు బార్లు కేటాయించనున్నట్లు మద్య నిషేద, ఆబ్కారీ శాఖ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2023-25 సంవత్సరాలకు లైసెన్స్‌ ఫీజు, నాన్‌ రిఫండబుల్‌ రిజిస్ట్రేషన్‌ చార్జీలు, బిడ్‌ అమౌంట్‌ చెల్లించని యజమానులకు చెందిన బార్లను కొత్త వారికి ఇవ్వనున్నారు. బార్ల

లైసెన్స్‌ కోసం గురువారం నుంచి ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవచ్చు. బార్ల లైసెన్స్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారు తాము కోరుకున్న ప్రాంతాల్లో 50వేల జనాభా వరకు రూ.ఐదు లక్షలు, 50వేల పైబడి రూ.ఐదు లక్షల లోపు జనాభా ఉంటే రూ.7.5లక్షలు, ఐదు లక్షలు పైబడి జనాభా ఉన్న పక్షంలో రూ.10లక్షలు నాన్‌ రిఫండబుల్‌ దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. వీరికి ఈ నెల 30న ఆన్‌లైన్‌లో బహిరంగ వేలం ద్వారా బార్లు కేటాయిస్తారు. బార్ల వారీగా ఖాళీగా ఉన్న ప్రదేశాలు, ఆఫ్‌సెట్‌ ధరలను గెజిట్‌ నోటిఫికేషన్‌లో పొందుపరించినట్లు వివేక్‌ యాదవ్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement