Monday, November 25, 2024

AP : అట్టహాసంగా అమరావతి హెచ్ ఆర్ చాప్టర్ ఏడవ వార్షికోత్సవం

ఎన్టీఆర్, ప్రభ న్యూస్ బ్యూరోః
మారుతున్న కాలం, పరిస్థితులకు అనుగుణంగా మానవ వనరుల అభివృద్ధిలో హెచ్ఆర్ ల పాత్రే కీలకంగా మారిందని డెల్లోయిట్ భాగస్వామి ఎస్ వి నాథన్ తెలిపారు. సంస్థలు, యాజమాన్యానికి ఉద్యోగులకు మధ్య సంక్లిష్ట వ్యవహారాలు తలెత్తిన సందర్భంలో వారి చొరవతోనే పరిష్కారం మార్గం సులభతరం అవుతుందని అభిప్రాయపడ్డారు. అమరావతి హెచ్ఆర్ చాప్టర్ 7వ వార్షికోత్సవాన్ని నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో ఆదివారం ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు.

సమస్త పురోభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తున్న హెచ్ఆర్ లు అందివస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం విరివిగా వినియోగించబడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెచ్ఆర్ లకు ఇంకో ఆయుధంగా సమకూరిందని తెలిపారు. మరో విశిష్ట అతిథి ప్రక్యత సినీ,బుల్లితెర నటుడు ప్రదీప్ మాట్లాడుతూ ఎక్కడైనా ఉద్యోగులకు యాజమాన్యానికి సంధానకర్తగా వ్యవహరించే హెచ్ఆర్ ల పాత్ర ఎంతో విశిష్టమైనది అన్నారు. మానవ సంబంధాలు రోజురోజుకీ సన్నగిల్లుతున్న నేటి రోజుల్లో మానవ సంబంధాలను మెరుగుపరచడంలో వీరి చొరవ ఎనలేనిది అన్నారు. ఈ వార్షిక సమావేశంలో పారిశ్రామిక, వ్యాపార సంస్థల్లో మానవ వనరుల అభివృద్ధి, మానవ సంబంధాల పటిష్టత, సంస్థల పురోభివృద్ధి, మానవ వనరుల కీలకపాత్ర వంటి తదితర అంశాలను ప్రముఖంగా చర్చించినట్లు అమరావతి హెచ్ఆర్ చాప్టర్ ఫౌండర్, అధ్యక్షుడు రవితేజ తల్లం తెలిపారు. వివిధ పారిశ్రామిక సెక్టార్లో ఎం ఎఫ్ జి, ఆటోమొబైల్, సాఫ్ట్వేర్, ఎడ్యుకేషన్, టెక్స్టైల్, ఫుడ్ అండ్ బబరైజర్స్, ఇంజనీరింగ్, హెల్త్ కేర్ ఇంకా సర్వీస్ సెంటర్ తదితర రంగాల్లో విశేష అనుభవం గడించిన పలువురు హెచ్ఆర్ లు తమ తమ కెరియర్లను ప్రారంభించి అనేకమంది ప్రొఫెషనల్ తయారు చేసిన విధానం హెచ్ ఆర్ లు ఎదుగుదలకు దోహదపడే అంశాలను, అనుభవాలను వివరించారు. హెచ్ఆర్ ఫీల్డ్ లో వస్తున్న ఆధునిక పద్ధతులు, బెస్ట్ ప్రాక్టీసెస్, ఇంకా వృత్తిపరమైన క్లిష్ట వ్యవహారాల్లో హెచ్ఆర్ ప్రొఫెషన్స్ ఒకరికొకరు పరస్పర సహకారంలో గైడెన్స్ అండ్ సందర్భ సూచికంగా వచ్చే ఇబ్బందులు, పరిష్కరించుకునే విధానం వంటి విషయాలలో తో పాటుగా సంబంధాలు కొనసాగించడం తదితర హెచ్ఆర్ వృత్తిపరమైన అంశాలను సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుని టెక్నాలజీలో సాంకేతికతను మానవ మనుగడలో అనూహ్యమైన రూపాంతరాలను పరిణమిస్తున్న సబ్జెక్టుని తమ అజెండాగా ఎంచుకుని తోటి హెచ్ఆర్ ప్రొఫెషనల్ యొక్క తాజా విజ్ఞాన అభివృద్ధికి ఉపయోగపడేలా ఈ సమావేశంలో నిర్ణయించుకున్నారు. ఈ వార్షికోత్సవంలో రాష్ట్రం, దేశం నలుమూలల నుండి సుమారు 300కు పైగా హెచ్ఆర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement