ఏకంగా సీఎం జగన్ పైనే దాడి జరగడంతో ఈసీ సీరియస్ అయింది. ఈ మేరకు బెజవాడ సీపీ కాంతి రాణా తాతాను నివేదిక కోరింది సీఈఓ ఎంకే మీనా.
తాతా నుంచి ప్రాథమిక సమాచారం తీసుకుంది ఏపీ సీఈఓ. ఏపీలో జీరో వయెలెన్స్ ఎన్నికలే టార్గెట్టుగా పెట్టుకుంది ఈసీ. ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించారు సీపీ కాంతి రాణా తాతా. అటు జగన్ పై రాళ్ళ దాడి ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.
- Advertisement -
సీఎం జగన్, వెల్లంపల్లి ఇద్దరికీ తగిలిన రాయి ఒకటేనా లేక వెర్వేరా అని విషయంపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే విచారణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన సీపీ రాణా … జగన్ పై దాడి కేసును నిరంతరం పరివేక్షిస్తున్నారు డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి.