Friday, November 22, 2024

AP : సీఎం జగన్ పై దాడి….కేసు నమోదు

ఏపీ సీఎం జ‌గ‌న్ పై దాడి ఘ‌ట‌న‌పై కేసు న‌మోదైంది. సింగ్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే వెల్లంపల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వెల్లంపల్లి ఇంటికి వెళ్లి స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారు.

- Advertisement -

దాడి చేసిన వ్యక్తి కోసం పోలీసుల గాలింపు చేపట్టారు. ఆరు బృందాలతో గాలింపులు మొదలు పెట్టారు. సంఘటన స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరిస్తు్న్నారు. హత్యాయత్నంగా సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసుకున్నారు.

ఇదిలా ఉండగా.. సీఎం జగన్‌పై దాడిని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. జరిగిన దాడి ఘటనపై పూర్తి వివరాలు తమకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీలో జీరో వయలెన్స్‌ ఎన్నికలే టార్గెట్‌గా పెట్టుకున్న ఈసీ.. ఏకంగా సీఎంపైనే దాడి జరగడంతో ఈసీ సీరియస్‌గా రియాక్ట్ అయింది.

గాయపడిన సీఎం జగన్‌కు వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. ఆయనకు ఎడమ కనుబొమ్మపై మూడు కుట్లు వేశారు. ట్రయాంగిల్ షేప్‌లో ఒక సెంటీమీటర్ లోతుకు గాయం అయిందని, అయితే మరీ లోతుగా గాయం కాకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు. ఆయన యథాతథంగా యాత్ర కొనసాగించొచ్చని తెలిపారు. మరో రెండు రోజుల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు.

సీఎం వైఎస్ జగన్​పై ఓ ఆగంతకుడు రాయితో దాడి చేశాడు. దాంతో ఆయన ఎడమ కనుబొమ్మపై భాగంలో గాయమయ్యింది. బస్సు యాత్రలో భాగంగా జగన్ శనివారం.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగ్ నగర్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ బస్సు పైనుంచి ప్రజలకు అభివాదం చేశారు. జనం పూలు జల్లుతూ ఆయనకు స్వాగతం పలికారు. అంతలో ఓ గుర్తుతెలియని వ్యక్తి పూలతో పాటుగా రాయిని కూడా విసిరాడు. అది నేరుగా జగన్ ఎడమ కనుబొమ్మపై భాగంలో తగిలింది. ఈ ఘటనలో బస్సుపై ఉన్న వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు కూడా గాయమైంది. డాక్టర్లు వెంటనే ఇద్దరి గాయాలకు ఫస్ట్ ఎయిడ్ చేశారు. చికిత్స తర్వాత జగన్ మళ్లీ బస్సు యాత్ర కొనసాగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement