Saturday, November 23, 2024

టీడీపీ దళిత నేతపై దాడి కేసు, నెల్లూరు మాజీ కార్పొరేటర్ అరెస్టు.. ప్రభుత్వ కుట్ర అంటున్న శ్రీధర్ రెడ్డి

️న️ల్లూరు(క్రైం), (ప్రభన్యూస్‌) : మాజీ కార్పొరేటర్‌, ️వసీపీ న️గర అధ్యక్షుడిగా పనిచేసిన️ తాటి.వంకటేశ్వరరావును ఇవ్వాల (శుక్రవారం) ️వేదాయపాలెం పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు ️నెలల క్రితం జ్యోతిన️గర్‌ ప్రాంతంలో టీడీపీ దళిత ️నేత మాతంగి కృష్ణపై జరిగిన️ దాడి కేసులో తాజాగా తాటి.వంకటేశ్వరరావును పోలీసులు అరెస్టు చేసిన️ట్లు తెలిసింది. దీంతో ️నెల్లూరు రూరల్‌ ఎ️మ్మల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అతని సోదరుడు గిరిధర్‌రెడ్డి, మరికొంత మంది నాయకులు ️వేదాయపాలెం పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి ️న️లకొంది. సేకరించిన️ సమాచారం ️మేరకు తెలుగు️దేశం పార్టీ దళిత ️నేత అయిన బుజబుజ ️నెల్లూరుకు చెందిన️ మాతంగి కృష్ణను నాలుగు నెలల క్రితం జ్యోతిన️గర్‌ ప్రాంతంలో కొంతమంది ️వెంబడించి దాడి చేసి గాయపరిచారు.

ఈ ఘటన️కు కారణం అప్పటి ️వైసీపీ ఎ️మ్మల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అనుచరులప️నేన️ని మాతంగి కృష్ణ ️వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు కూడా న️️మాదు చేశారు. ఇటీవల రూరల్‌ ఎ️మ్మల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ️వైసీపీ పార్టీని వీడడంతో పోలీసులు మాతంగి కృష్ణ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ కార్పొరేటర్‌, ️వైసీపీ న️గర అధ్యక్షుడిగా పనిచేసిన️ తాటి.వంకటేశ్వరరావును శుక్రవారం అదుపులోకి తీసుకుని గోప్యంగా విచారించిన️ట్లు తెలిసింది. ఈ సమాచారం అందుకున్న ఎ️మ్మల్యే కోటంరెడ్డి, అతని సోదరుడు, వారి ️వెంట న️డిచే కొంతమంది కార్పొరేటర్లు, నాయకులు పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. దీంతో స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ️న️లకొంది.

అరెస్టుల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు..

వైసీపీ పార్టీని వీడాన️న్న కక్షతో తన️తో న️డుస్తున్న వారిని అరెస్టుల పేరుతో పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రూరల్‌ ఎ️మ్మల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. మాజీ కార్పొరేటర్‌గా ️మొన్నటి వరకు ️వైసీపీ న️గర అధ్యక్షుడిగా పనిచేసిన️ తాటి.వంకటేశ్వరరావును అరెస్టు చేయడంతో ️వేదాయపాలెం స్టేషన్ కు వద్దకు చేరుకున్న ఎ️మ్మల్యే శ్రీధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొంతమంది కార్పొరేటర్లు, న️ాయకులు, తన️తో పాటు పార్టీని వీడి తన️బాటలో న️డుస్తున్నారని, అధికార పార్టీ నాయకులు తన️పై కక్ష కట్టి తన️తో పాటు న️డిస్తే అరెస్టులు తప్పవని బెదిరించేందుకే తాటి ️వంకటేశ్వరరావును ఇప్పుడు పోలీసులు అరెస్టు చేశారన్నారు. నాలుగు నెలల క్రితం జరిగిన️ ఓ దాడి కేసుకు సంబంధించి పోలీసులు హడావుడిగా ఇప్పుడు అరెస్టులు చూపిస్తున్నారంటే తన️పై, తన️ వారిపై అధికార పార్టీ తమ జులూం చూపిస్తుందన్న విషయం తేటతెల్లం అవుతుందన్నారు. తన️ బాటలో ఏ కార్పొరేటర్‌, ఏ నాయకుడు న️డవకూడదన్న సంకేతాన్ని ఇస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement