ముగ్గురు అమ్మాయిలపై రోజుల తరబడి అత్యాచారం జరిగింది. పూజల ద్వారా డబ్బు వస్తుందని (ఈజీ మని) ముగ్గురు అమ్మాయిలతో నగ్న పూజలు చేయించారు.. చిలకలూరిపేటకు చెందిన మహిళను సూత్రధారిగా గుర్తించారు. వివరాలిలా.. గుంటూరు జిల్లా పొన్నేకల్లు గ్రామంలోని జెండా చెట్టు సమీపంలో గల నకిలీ పూజారితో విజయవాడ, గుంటూరు, పొన్నెకల్లు, ఒంగోలులోని లాడ్జిల్లో పూజల పేరుతో మోసం చేశారు. చిలకలూరిపేటకు చెందిన మహిళకు సోషల్ మీడియాలో పరిచయమైన పొన్నెకల్లుకు చెందిన నకిలీ పూజారి తోడయ్యాడు. అనతికాలంలోనే అధికంగా డబ్బును సంపాదించాలనే దురుద్దేశంతో అమ్మాయిలు మహిళను కోరారు. దీంతో నకిలీ పూజారిని రంగంలోకి దించిన ఆ మహిళ ఈ అఘాయిత్యానికి పాల్పడింది. గతకొన్ని రోజులుగా పూజల పేరుతో అమ్మాయిలపై అత్యాచారం ? జరిగినట్లు తెలుస్తోంది. గుంటూరు, విజయవాడ, ఒంగోలులోని లాడ్జిలో అమ్మాయిలను నగ్నంగా కూర్చోబెట్టి పూజలు నిర్వహించిన వైనం చోటుచేసుకుంది. పోన్నేకల్లులో కూడా ఓ రహస్య ప్రదేశంలో అమ్మాయిలను నగ్నంగా కూర్చోబెట్టి పూజలు చేసిన అనంతరం నకిలీ పూజారి ముగ్గురు అమ్మాయిలను శారీరకంగా అనుభవించిన ఘటన జరిగింది.
అమ్మాయిలను రక్షించిన దిశ యాప్ :
పూజల మధ్యలో లేస్తే వచ్చే లక్షల రూపాయలు రాకుండా పోతాయని నకిలీ పూజారితో పాటు మహిళ అమ్మాయిలను నిలువునా మోసం చేశారు. మోసపోయిన ముగ్గురమ్మాయిలు కర్నూలు జిల్లా ఆత్మకూరు ప్రాంతవాసులుగా గుర్తించారు. వచ్చే డబ్బులో వాటాకోసం మరో ముగ్గురు యువకులు సైతం వినూత్న ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. వీరు కూడా అదే ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అనుమానం వ్యక్తం చేసిన అమ్మాయిలు.
వ్యవహారం బెడిసి కొట్టడంతో అమ్మాయిలను అమరావతి రోడ్డులోని హోసన్నా మందిరం సమీపంలో నకిలీ పూజారి వదిలి వెళ్లాడు. దీంతో దిశ యాప్ ద్వారా అమ్మాయిలు పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన నల్లపాడు పోలీసులు
బాధిత అమ్మాయిలను స్టేషన్ కు తరలించి, రక్షణ కల్పించడంపై నల్లపాడు పోలీసుల స్పందన పై అమ్మాయిలు కృతజ్ఞతలు తెలిపారు. ముగ్గురు అమ్మాయిలతో పాటు మరో ముగ్గురు యువకులు, చిలకలూరిపేటకు చెందిన మహిళ, పరారీలో పోన్నేకల్లుకు చెందిన నకిలీ పూజారిపై నల్లపాడు పోలీసులు విచారణ చేపట్టారు.