ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల దాకా ఓటింగ్ జరగనుంది. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతితో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. వైసీపీ, బీజేపీ సహా మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2,13,388 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
వీరికోసం అధికారులు 279 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఓటింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌తో పాటు.. సమస్యాత్మక ప్రాంతాలైన 78 చోట్ల వెబ్‌క్యాస్టింగ్ చేస్తున్నారు. ఈ నెల 26న ఓట్ల లెక్కింపు జరగనుంది. గత ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది సీఎం జగన్ మంత్రివర్గంలో ఐటీ, పరిశ్రమల మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి.. ఈ ఏడాది ఫిబ్రవరి 21న మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఉపఎన్నిక జరుగుతున్నది.