Saturday, November 23, 2024

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీపై.. క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీపై టీడీపీ అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. పార్టీ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…. చనిపోయిన కుటుంబ సభ్యులకే ఉప ఎన్నికల్లో సీటు ఇస్తే పోటీ పెట్టకూడదనేది టీడీపీ విధానమని ఆయన స్పష్టం చేశారు. గౌతమ్‌ రెడ్డి మృతితో వచ్చిన ఉప ఎన్నికల్లో ఈ విధానంతోనే పోటీకి దూరంగా ఉంటున్నామని వెల్లడించారు. ఉప ఎన్నికలపై వైసీపీ సవాళ్లు నీచంగా ఉన్నాయని విమర్శించారు. బద్వేలులో ఎందుకు పోటీ పెట్టలేదో ఆత్మకూరులో కూడా అందుకే పోటీ పెట్టడం లేదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement