కర్నూలు, ప్రభన్యూస్ : ఆత్మకూరు నివురుగప్పిన నిప్పులా ఉంది. రెండు వర్గాల మధ్య తలెత్తన ఘర్షణతో పట్టణంలో నేటికి హైటెన్షన్ నెలకొంది. ఈనెల 8వ తేదీ రాత్రి నుంచి ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఓ వర్గం చేపట్టిన నిర్మాణాన్ని బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది. దీంతో పోలీసులు అతన్ని వెనక్కి పంపించారు. ఈ క్రమంలో శ్రీకాంత్ రెడ్డి వాహనాన్ని మరోవర్గం వారు అడ్డుకున్నారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో అక్కడి నుంచి శ్రీకాంత్‌రెడ్డి నేరుగా ఆత్మకూర్ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. విషయం తెలుసుకున్న మరోవర్గం వారు పోలీసు స్టేషన్‌ను దిగ్బంధించి శ్రీకాంత్‌రెడ్డిపై దాడి చేశారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. అలాగే రెండు బైకులకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. దీంతో పరిస్థితిని అదుపు తెచ్చేందుకు పోలీసులు ఏకంగా మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘర్షణలో పదిహేను మందికి పైగా గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పోలీసులు ఉన్నారు. వీరిలో ఓ కానిస్టేబుల్ కు దవడ చిట్లు పోయింది. మరో ఇద్దరికీ గాయాలు కాగా సర్జరీ చేసే పరిస్థితి నెలకొంది.
ఇది కూడా చదవండి : శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
సంఘటనం అంతరం పరిస్థితి చేజారిపోవడంతో.. జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఆత్మకూరు చేరుకున్నారు. అక్కడే ఉండి ఈ ఘటనపైలోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా తిరిగి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు. అంతేకాదు ఈనెల 13 వరకు ఆత్మకూరు అంతటా 144 సెక్షన్ విధించారు. ఎక్కడ ఎవరైనా గుమి కూడితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సంఘటన రోజు తీసుకున్న వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల వివరాలు, ఇతరత్ర మెరకు ఇప్పటివరకు ఈ ఘటనలో మొత్తం 60 మందిని అరెస్టు చేశారు. ఇందులో మసీదు వద్ద జరిగిన ఘటనలో ఆరు మందిపై కేసు నమోదు చేయగా, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ పై జరిగిన మూకుమ్మడి దాడి లో 56 మంది ని అరెస్టు చేయడం జరిగింది. ఇందులో ఆదివారం 47 మందిని అరెస్టు చేయగా, సోమవారం 9 మందిని అరెస్టు చేశారు.
ఎస్డీఎఫ్ పాత్రపై ఆరా…
ఆత్మకూరు మజీద్ ఘటన తర్వాత పోలీస్ స్టేషన్ పై జరిగిన దాడిని పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తుంది. వాస్తవంగా మజ్జిద్ వద్ద జరిగిన సంఘటన చిన్నదే అయినప్పటికీ, పోలీస్ స్టేషన్ వద్ద అంత ఉద్రిక్తతకు తెర వెనుక ఎస్ డి ఎఫ్ అతివాద సంస్థ ప్రమేయం ఉన్నట్లు- పోలీస్ శాఖ దర్యాప్తులో వెల్లడైంది. ఘటన అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన అల్లర్లు జరగా అందులో వెలుగోడు చెందిన కొంతమంది వ్యక్తులు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరిలో ఆరుగురు ఎస్ డి ఎఫ్ అతివాద సంస్థ సభ్యులుగా తేలింది. వీరు ఇటీ-వల ఎస్ డి ఎఫ్ అతివాద సంస్థ నిర్వహించిన శిక్షణా తరగతులకు వెళ్ళి వచ్చినట్లు- జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. సోమవారం అరెస్టు చేసిన 9 మందిలో వీరు ఆరుగురు కూడా ఉన్నట్లు- ఆయన ప్రకటించారు. ఇటీ-వల నంద్యాలలో నిర్వహించిన శిక్షణ తరగతులు కూడా వీరు హాజరైనట్లు- పోలీస్ శాఖ గుర్తించింది. ఈ క్రమంలో ఆత్మకూరు ఘటన రెండు వర్గాల మధ్య జరిగింది కాదని, కొంతమంది వ్యక్తుల కుట్ర వల్లే జరిగినట్లు-గా పోలీస్ శాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేకాకుండా వీటి వెనుక రాజకీయ వర్గాల కుట్ర ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. వైసీపీ బీజేపీ మధ్య జరిగిన సంఘటన గా అభిప్రాయం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : కర్నూలు జిల్లాలో మొబైల్ గేమ్స్ పేరుతో మోసం
ఓ వైపు ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్న మరోవైపు ఎస్ డి ఎఫ్ రూపంలో అతివాదుల ప్రమేయం ఎంత వరకు ఉందనే అనే కోణంలో లోతుగా విచారణ చేస్తున్నారు. మరోవైపు ఆత్మకూర్ సంఘటనను సీరియస్ గా పరిగణించిన బిజెపి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు సాగిస్తున్న సంగతి విదితమే. మరోవైపు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన ప్రభుత్వం సీరియస్ గా పరిగణించడం పై మండిపడుతున్నాయి. ముగ్గురు పోలీసుల పరిస్థితి విషమంగా ఉన్న పోలీసులకు అత్యున్నత స్థాయి అధికారులుఆత్మకూరును సందర్శించకపోవడం పై విమర్శలు గుప్పిస్తున్నారు. అనుమతి లేకుండా నిర్మాణం జరుగుతున్న మజ్జిద్ వద్దా అ జరిగిన చిన్న ఘర్షణను ఆధారంగా చేసుకొని ఏకంగా పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన ఈ కుట్ర వెనుక నిజాన్ని నిగ్గు తేల్చాలని బీజేపీ వర్గాలు కోరుతున్నాయి. మరోవైపు ఆత్మకూరు ఘటన వెనుక ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని పోలీసులకు లభించిన వీడియో క్లిప్, ఇతర ఆధారాల సేకరణతో ఘటనకు బాధ్యులైన వారందరినీ అరెస్టు చేయనున్నట్లు- జిల్లా ఎస్పీ ప్రకటించారు. మొత్తంగా ఈ నెల 8 న ఆత్మకూరు పట్టణంలో జరిగిన ఘర్షణ నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుంది, పరిస్థితి ఎలా ఉంటుందో.. అనే భావనతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital