విశాఖపట్నం ఆగస్టు 28 ప్రభ న్యూస్ ఫార్మా రియాక్టర్ ప్రమాదంలో గాయపడిన వారికి, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. మీరు ధైర్యంగా ఉండండి మేము అండగా ఉందాం అంటూ వారిని ఓదార్చారు. గురువారం నగరానికి చేరుకున్న ముఖ్యమంత్రి తిన్నగా వెంకోజి పాలెం మెడి కవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శతకాత్రులను పరామర్శించారు. పేరుపేరునా అందరి దగ్గరికి వెళ్లి వారి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు.
ప్రమాద ఘటనపై ఆరా తీశారు. అనంతరం కుటుంబ సభ్యులను కూడా ఓదాచారు. మీరు ధైర్యంగా ఉండండి వారికి మెరుగైన సేవలు అందుతున్నాయి. క్షేమంగా ఇంటికి చేరుకుంటారు. అని భరోసా కల్పించారు. ఈ ప్రమాదంపై తాను బుధవారం నుంచి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నానని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
చంద్రబాబు భావోద్వేగం..
అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. బాధితుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అయితే, మెడికవర్ ఆస్పత్రి దగ్గర సీఎం చంద్రబాబు భావోద్వేగం అయ్యారు. ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 17 మంది మృతి చెంది.. 36 మందికి గాయాలయ్యాయాని అధికారులు వివరించారు. 10 మందికి తీవ్రగాయాలు, 26మందికి స్వల్పగాయాలు అయ్యాయని తెలిపారు. . కాగా ఈ ప్రమాదంలో మృతుల కుటుంబానికి ₹కోటి, గాయపడిన క్షతగాత్రులకు ₹50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి ₹ 25 లక్షలు అందజేయనున్నట్లు సీఎం వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాల జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అక్కడ నుంచి కేజీహెచ్ కు ప్రయాణమయ్యారు. ప్రమాదం జరిగిన జరిగిన రాంబిల్లి మండలం ఫార్మా ఫ్యాక్టరీని కూడా ఆయన పరిశీలించారు.
భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాల జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అక్కడ నుంచి కేజీహెచ్ కు ముఖ్యమంత్రి ప్రయాణమయ్యారు. ఆ తర్వాత ఆయన సంఘటన జరిగిన రాంబిల్లి మండలం ఫార్మా ఫ్యాక్టరీని కూడా పరిశీలించారు
అంతకుముందు నగరానికి చేరుకున్న చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్సీ చిరంజీవి రావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ తదితరులు ఆయనకి ఘనంగా స్వాగతం పలికారు.
విద్యార్థులతో చంద్రబాబు
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్నంలో కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. గురువారం నగరానికి వచ్చిన ఆయన కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల బంధువులతో కూడా ఆయన మాట్లాడారు.