Monday, November 25, 2024

AP | అసైన్డ్ భూముల కుంభకోణం.. చంద్రబాబుపై సీఐడీ ఛార్జ్‌షీట్

ఏపీలో ఎన్నికల ముందు.. మ‌రోసారి అసైన్డ్ భూముల కుంభకోణం తెరపైకి వచ్చింది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని సీఐడీ వెల్లడించింది. అమరావతి రాజధానిలో భారీ భూదోపిడీ జరిగిందిన సీఐడీ పేర్కొంది. రాజధాని నగర ప్రణాళిక పేరుతో చంద్రబాబు భూముల దోపిడికి పాల్పడ్డారని తేల్చింది. రికార్డులను ట్యాంపరింగ్ చేశారని సీఐడీ విచారణలో తేల్చింది.

ఈ స్కాంలో 1100 ఎకరాల అసైన్డ్ భూముల్లో కుంభకోణం జరిగిందని విచారణలో నిర్ధారించిన అంశాలను సీఐడీ బయటపెట్టింది. 4,400 కోట్ల కుంభకోణం జరిగింది తెలిపింది. దీంతో చంద్రబాబును నిందితుడిగా చార్జిషీటులో పేర్కొంది. ఆయనతో పాటు.. మాజీ మంత్రి నారాయణ, మాజీ తహసీల్దార్ సుధీర్ బాబు, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ ను ముద్దాయిలుగా సీఐడీ ఛార్జ్ షీట్ లో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement