ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సమావేశాల్లో గురువారం చివరిరోజు ఏపీ సీఎం వైఎస్ జగన్ బడ్జెట్‌పై, ప్రతిపక్ష పార్టీల వ్యవహారం పై సుదీర్ఘంగా మాట్లాడారు. ఈనెల 5న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 9 బిల్లులకు ఆమోదముద్ర వేశారు. మూడురోజుల పాటు కొనసాగిన సమావేశాల్లో ప్రతిపక్ష టీడీపీ సభ్యులు అధికార వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన నిర్వహించారు.
రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై పరిష్కరించడంతో జగన్ ప్రభుత్వం విఫలమైందంటూ నిరసన తెలిపారు. ఈనెల 5న గవర్నర్ ప్రసంగంతో మొదలైన అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ కొనసాగింది. మూడోరోజు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.