రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవగా.. స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా విశాఖ మెట్రో రైల్‌పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
2018లో మెట్రోరైల్ టెండర్‌ల వరకూ వెళ్లిపోయిందని.. అయితే విశాఖపట్నం ఓ ప్యాలెస్ కట్టుకోవడానికే పరిమితం అయ్యారని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. కోల్‌కతాలో మొత్తం మెట్రోకు కేంద్రం నిధులు ఇచ్చిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు విభజన చట్టంలో ఉందని ఎమ్మెల్యే వెల్లడించారు. మెట్రోరైల్ ఫస్ట్ ఫేజ్‌లో మరో ఆరు కిలోమీటర్లు పెంచితే మరింత ఉపయోగం ఉంటుందని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు.
- Advertisement -