Thursday, November 21, 2024

Assembly – సీనియర్ సభ్యుడు అయ్యన్నను స్పీక‌ర్ గా చూడటం ఆనందంగా ఉంది – చంద్రబాబు

సీనియ‌ర్ స‌భ్యుడ్ని స్పీక‌ర్ గా చూడటం ఆనందంగా ఉంది
40 ఏళ్ల రాజ‌కీయ జీవితం.. ఏడు సార్లు ఎమ్మెల్యే,
ఎంపిగా , 16 ఏళ్లు మంత్రిగా ఉండ‌టం ఆయ‌న‌కే సాధ్యం
పార్టీని క‌న్న‌త‌ల్లిగా భావించిన మ‌హోన్న‌తుడు అయ్య‌న్న‌
అయిదేళ్ల‌లో ఏకంగా 23 కేసులు ఎదుర్కొన్న నేత
చివ‌రికి జ‌గ‌న్ ఆయ‌న‌పై ఏకంగా రేప్ కేస్ పెట్ట‌డం దార‌ణం
గ‌త పాల‌కుడి చేతిలో అయ్య‌న్న క‌ష్టాలు క‌న్నీళ్లు తెప్పిస్తాయి
ఆయ‌న‌లోని మంచిని తీసుకుని ముందుగా
సాగాల‌ని కొత్త స‌భ్యుల‌కు చంద్ర‌బాబు హిత‌వు

తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత సీనియర్ శాసనసభ్యుల్లో ఒక‌రైన అయ్య‌న్న‌పాత్రుడు నేడు శాసనసభ అధ్యక్ష పదవిలో చూడడం చాలా సంతోషంగా ఉంద‌న్నారు టిడిపి స‌భానాయ‌కుడు చంద్రబాబు.. గతంలో మిమ్మల్ని సభలో ఎమ్మెల్యేల మధ్య చూసిన తాను ఇప్పుడు అధ్యక్ష స్థానంలో చూస్తుంటే మ‌రింత ఎంతో ఆనందంగానూ, గర్వంగానూ ఉంద‌ని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఆయన స్పీక‌ర్ చైర్ లో కూర్చోబెట్టిన అనంతరం చంద్రబాబు ప్రసంగిస్తూ,
అందరి ఆమోదంతో, 16వ శాసనసభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మీకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు అని తెలిపారు…

ఆనాడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించి, యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపు ఇచ్చిన మేరకు అయ్యన్నపాత్రుడు రాజకీయాల్లోకి వచ్చారని, అప్పటికి ఆయన వయసు 25 సంవత్సరాల‌ని చెప్పారు.. అక్కడ్నించి ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారిగా ఎంపీగా గెలిచి మంత్రిగానూ తెలుగు రాష్ట్రాల్లో తనదైన ప్రత్యేక ముద్రను వేయగలిగార‌ని ప్ర‌శంసించారు.. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తీసుకువచ్చిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు అని చంద్ర‌బాబు చెప్పారు..

ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలవడం, 16 ఏళ్లు మంత్రిగా పనిచేయడం, 1996లో అనకాపల్లి ఎంపీగా గెలుపొందడం, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పదేళ్లు పనిచేయడం… సాంకేతిక విద్య, అటవీ శాఖ, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా,. మూడు సార్లు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేచేయ‌డం ఆయ‌న ప్ర‌తిభ ద‌క్కిన గౌర‌వం అంటూ విశ్లేషించారు..

అయ్యన్న పాత్రుడు పోరాట యోధుడ‌ని,, రాజీపడని నాయకుడ‌ని అంటూ , విశిష్టమైన లక్షణాలు ఉండే వ్యక్తి. తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల ప్రాంతంలోనైనా అయ్యన్నపాత్రుడు గురించి అడిగితే చెబుతార‌న్నారు.. . ఆయన వయసు 66 సంవత్సరాలు అయిన‌ప్ప‌టికీ ఇప్పుడు కూడా ఫైర్ బ్రాండే నంటూ . ఆయన చివరి క్షణం వరకు ఫైర్ బ్రాండ్ గానే కొన‌సాగుతార‌ని తేల్చి చెప్పారు చంద్ర‌బాబు..

- Advertisement -

ఈ అసెంబ్లీలో చాలామంది మొదటిసారి ఎమ్మెల్యేగా వచ్చిన వాళ్లు ఉన్నార‌ని,… కొందరు రెండోసారి ఎమ్మెల్యేలుగా వచ్చిన వాళ్లు ఉన్నార‌ని అంటూ అయ్యన్నపాత్రుడు 42 ఏళ్లుగా ఒక నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని, అక్కడే ఏడు పర్యాయాలు గెలవడం అనేది ఒక అరుదైన విషయమ‌ని చంద్ర‌బాబు చెప్పారు.. చాలామందికి రెండు, మూడు సార్లు గెలిచేసరికి వారి మనస్తత్వం మారిపోతుంద‌ని . అయ్యన్నపాత్రుడు అందుకు భిన్నమైన వ్యక్తి అని పేర్కొన్నారు. అప్పటికీ ఇప్పటికీ అదే చిత్తశుద్ధితో పనిచేస్తున్నార‌ని,. పార్టీని కన్నతల్లిలా భావిస్తూ 42 ఏళ్లుగా పసుపు జెండాను మోస్తూనే ఉన్నారని ప్ర‌శంస‌లు కురిపించారు..

రాష్ట్రాభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధిని కాంక్షించే వ్యక్లి అయ్యన్న అని అన్నారు. ముఖ్యంగా విశాఖ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశార‌న్నారు.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసం పాటుపడ్డార‌ని, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు నీళ్లు కావాలి, గోదావరి నీళ్లు రావాలి, ఆ ప్రాంతం కూడా బాగుపడాలి… మా కరవు ప్రాంతానికి నీళ్లు కావాలని క్యాబినెట్ మంత్రిగా వెంటపడి సాధించుకున్న వ్యక్తి అయ్యన్న పాత్రుడు అని పేర్కొంటూ అందుకు ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాన‌ని అన్నారు చంద్ర‌బాబు..

అయిదేళ్లు అయ‌న‌కు క‌ష్టాలు

కష్టాలు అందరికీ వస్తాయ‌ని, . ఆయన తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోనంత ఇబ్బందులు గత ఐదేళ్లుగా ఎదుర్కొన్నార‌న్నారు. . అదీ మామూలుగా కాద‌ని, ఆయ‌న ఇంట్లోకి గోడలు పగలగొట్టుకుని వందల మంది పోలీసులు వచ్చి. అది కూడా రాత్రివేళ వచ్చి భయానక వాతావరణాన్ని సృష్టించార‌న్నారు… ఒక పోలీస్ స్టేషన్ లో కాకుండా ఆయ‌న‌పై… అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టార‌న్నారు.. రాత్రివేళ తీసుకుపోయి ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్ కు తిప్పినా ఆయన ఎక్కడా భయపడలేద‌న్నారు. ఆయనపై 23 కేసులు పెట్టార‌ని, అందులో 10 కేసులు సీఐడీ వాళ్లవేన‌న్నారు.. అయినప్పటికీ రాజీలేని పోరాటం చేసి ముందుకు వెళ్లార‌న్నారు.. 60 ఏళ్లు దాటిన ఆయనపై ఆఖరికి అత్యాచారం కేసు కూడా పెట్టార‌ని అంటూ ఇది జ‌గ‌న్ మార్క్ పాల‌న‌కు అద్డంప‌డుతుంద‌ని చెప్పారు..

అయ్య‌న్న‌ను ఆద‌ర్శంగా తీసుకోండి..

ఈ సభలో ఉండేవారందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్క నాయకుడి జీవితంలోనూ కొన్ని స్ఫూర్తిదాయక ఘటనలు ఉంటాయి. అయ్యన్న పాత్రుడి జీవితంలో ఉండే పాజిటివ్ అంశాలను మీరు కూడా గమనించాలి , వాటిని స్పూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలి అంటూ త‌న ప్ర‌సంగాన్ని ముగిస్తూ కొత్త‌గా ఎన్నికైన స్పీక‌ర్ అయ్య‌న్న‌కు మ‌రోసారి శుభాకాంక్ష‌లు తెలిపారు చంద్రబాబు..

Advertisement

తాజా వార్తలు

Advertisement