తప్పుతడకగా చదివిన పలువురు ఎమ్మెల్యేలు
ఆ పదం స్థానంలో శ్రద్దా శక్తుల పదం కూర్పు
తన పేరునే మర్చిపోయిన జగన్
తత్తరపాటుతో లోకేష్ రెండు సార్లు ప్రమాణం
శ్రద్దాశక్తుల పద ఉచ్చారణలోనూ ఎమ్మెల్యేల తడబాటు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాసనసభ్యుల ప్రమాణంలో చాలామందికి నోరు తిరగని పదం మాయమైంది. గతంలో శాసనసభ్యులుగా, మండలి సభ్యులుగా ప్రమాణం చేసేటపుడు నోరు తిరగక తిప్పలు పడ్డ పదాన్ని తొలగించారు. గతంలో పలువురు సభ్యులు తడబడి, పలకడానికి తత్తరపడుతూ ట్రోలింగ్‌కు గురయ్యారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే క్రమంలో “అంత: కరణ శుద్ధితో” పదాన్ని తొలగించారు. ఎమ్మెల్యేగా స్వీకరించే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తామని ఎమ్మెల్యేలు సభలో చేసే ప్రమాణ పత్రాన్ని సవరించారు. అంతకరణ శుద్ధితో పదాన్ని పలకలేక చాలామంది సభ్యులు తడబడి తిప్పలు పడ్డారు. ఏపీ అసెంబ్లీలో సభ్యుల ప్రమాణం సందర్భంగా అదితిగజపతిరాజు పూసపాటి, పల్లె సింధూర రెడ్డి ఆంగ్లంలో ప్రమాణం చేశారు. కొందరు సభ్యులు శ్రద్ధాసక్తులతో పదాన్ని పలకడానికి కూడా ఇబ్బంది పడ్డారు.
పేరు మర్చిపోయిన జగన్…
ఏపీ అసెంబ్లీలో ప్రమాణం చేసిన మాజీ సిఎం జగన్ తన పేరు మర్చిపోయారు. మొదట వైఎస్. జగన్మోహన్ అని పలికిన ఆయన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను పూర్తి పేరును రెండోసారి పలికారు. మంత్రి నారా లోకేష్ కూడా ప్రమాణం సందర్భంగా తత్తరపడ్డారు. దీంతో రెండు సార్లు ఓత్ తీసుకున్నారు.. మాజీ మంత్రి పరిటాల సునీత ప్రమాణంలో రెండు సార్లు వేరువేరు పేర్లను పలికారు.