Tuesday, November 26, 2024

మాన్సాస్ ట్రస్ట్ ఈవో సహకరించడం లేదుః హైకోర్టులో అశోక్‌ గజపతిరాజు పిటిషన్‌

మాన్సస్ ట్రస్ట్ ఈఓ వెంకటేశ్వరరావు సహకరించడం లేదంటూ ఆ ట్రస్ట్ చైర్మన్  అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేదని పిటిషన్ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఏ బెంచ్ విచారణ జరపాలో సీజే ముందు పెట్టి నిర్ణయించాలని రిజిస్ట్రీకి ఆదేశించింది. సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది. 

కాగా, కొద్దిరోజుల క్రితం.. పెండింగ్​ జీతాలు చెల్లించాలంటూ విజయనగరంలోని మాన్సాస్‌ కార్యాలయం వద్ద ట్రస్టు కళాశాలల ఉద్యోగులు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. జీతాలు నిలిపివేయాలని ఈవో వెంకటేశ్వరరావు బ్యాంకుకు లేఖ రాయడంతోనే వేతనాలు నిలిచిపోయాయని ఉద్యోగులు ఆరోపించారు. 16 నెలలుగా అరకొర జీతాలతోనే పనిచేస్తున్నా..ఈనెల పూర్తిగా నిలిపివేశారని మండిపడ్డారు. అడిగితే నాకేం తెలియదని ఈవో చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాల సమస్యలను ట్రస్టు ఛైర్మన్​ అశోక్​ గజపతిరాజు దృష్టికి ఉద్యోగులు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఈవో తీరుపై గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు.

ఇది కూడా చదవండిః గుట్కా తీసుకునే మంత్రులా ఈటలను ఓడించేది?: బండి

Advertisement

తాజా వార్తలు

Advertisement