Friday, November 22, 2024

Alert: వస్తోంది ‘అసానీ’ తుపాను.. 10న శ్రీకాకుళం, ఒడిశా మధ్య తీరం దాటే చాన్స్​!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది వాయవ్య దిశగా వేగంగా కదులుతూ తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తుపానుగా మారితే దీనికి ‘అసానీ’గా నామకరణం చేయనున్నారు. ఇది శ్రీకాకుళం, ఒడిశా తీరం మధ్య ఈ నెల 10వ తేదీన తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం అంత తీవ్రంగా ఉండదని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. అయితే.. ఇటు ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. మిగిలిన ప్రాంతాల్లో పలుచోట్ల ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement