Wednesday, November 20, 2024

AP | పాత విధానంలోనే.. రీయింబర్స్‌మెంట్‌.. నారా లోకేష్

  • స్టూడెంట్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్‌
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులపై స్పష్టత
  • ₹3,500 కోట్ల బకాయిలను దశలవారీగా చెల్లిస్తాం
  • విద్యార్ధులకు పూర్తి సహకారం, మద్దతు ఉంటుంది
  • వైసీపీ స‌ర్కారు హ‌యాంలో సిస్ట‌మ్‌ని దెబ్బ‌తీశారు
  • మ‌ళ్లీ పున‌రుద్ధ‌రిస్తామ‌న్న హెఆర్ మినిస్ట‌ర్ లోకేష్‌

ఆంధ్రప్రభ స్మార్ట్​, విజయవాడ: ఏపీ వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో ఇటు విద్యార్ధులతో పాటు కళాశాల యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి. అనేక మంది విద్యార్ధులు ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్యను మంత్రి నారా లోకేష్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా గురువారం ఆయ‌న స్పందించారు. ఈమేర‌కు హ్యూమ‌న్ రీసోర్స్ మినిస్ట‌ర్ లోకేష్‌ కీలక ప్రకటన చేశారు.

3500 కోట్ల బ‌కాయిల‌ను చెల్లిస్తాం..

ఫీజు రీయింబర్స్‌మెంట్ నగదును కళాశాల ఖాతాలకు నేరుగా బదిలీ చేసే పాత పద్ధతిని పునరుద్ధరిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. గత ప్రభుత్వం పెట్టిన ₹3,500 కోట్ల బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని పేర్కొన్నారు. విద్యార్ధులకు సంబంధించిన సర్టిఫికెట్‌లు, ఇతర డాక్యుమెంట్ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. విద్యార్ధులకు తన పూర్తి సహకారం, మద్దతు ఉంటాయని తెలిపారు.

- Advertisement -

సిస్ట‌మ్‌ని మ‌ళ్లీ పున‌రుద్ధ‌రిస్తాం..

గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ప్రభుత్వం నేరుగా కళాశాల ఖాతాలకు జమ చేస్తుండేది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధానానికి స్వస్తిపలికి కళాశాల ఫీజుల నగదును విద్యార్ధుల తల్లుల ఖాతాలో జమ చేసే విధానం ప్రవేశపెట్టింది. దీంతో తల్లుల ఖాతాలో జమ అయిన నిధులను విద్యార్ధులే కళాశాలలకు చెల్లించే వారు. అయితే ఈ విధానంతో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను తల్లుల ఖాతాలో జమ చేసినా కొందరు సకాలంలో కళాశాలలకు చెల్లించకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి పాత విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే విషయాన్ని మంత్రి నారా లోకేష్‌ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement