విశాఖ: రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు విశాఖ ఆరో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కమ్ రైల్వే న్యాయస్థానం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రైల్వే స్టేషన్లోకి అనధికారికంగా ప్రవేశించారని ఐదేళ్ల కిందట అమర్నాథ్ పై కేసు నమోదైంది. 2018లో ప్రత్యేక హోదా, రైల్వే జోన్ డిమాండ్ చేస్తూ స్టేషన్లోకి అనధికార ప్రవేశం చేశారు. విశాఖ-పలాస ప్యాసింజర్ రైలును నిలిపేసి రైల్‌రోకో నిర్వహించారు. దీంతో గుడివాడ అమర్ తో పాటు పలువురు వైసీపీ నేతలు ఉన్నటు రైల్వే అధికారులు గుర్తించారు. విచారణలో భాగంగా నిందితులు ఫిబ్రవరి 27న న్యాయ స్థానంలో హాజరు అవ్వాలి. కానీ..గుడివాడ అమర్నాథ్, జాన్ వెస్లీలు కోర్ట్‌కి హాజరు కాకపోవడంతో నాన్ బెయిల్ అరెస్ట్ వారెంట్ జారీ కేసును మార్చి 7వ తేదీకి వాయిదా వేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement