Tuesday, November 26, 2024

అంతరాష్ట్ర దొంగల అరెస్ట్.. బంగారం స్వాధీనం.. ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి

తిరుపతి సిటీ ( ప్రభ న్యూస్): న‌లుగురు అంతరాష్ట్ర దొంగల‌ని అరెస్ట్ చేశారు పోలీసులు. వారితో పాటు వారివ‌ద్ద నుంచి 870 గ్రాములు బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఆ న‌గ‌ల విలువ 35లక్షల రూపాయలు ఉంటుందని జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. ఆటోనగర్ బస్ స్టాప్ వద్ద అనుమానిత వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి నగలను స్వాధీనం చేసుకున్నామ‌న్నారు. జ‌ల్సాల‌కి అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చంద్రగిరి తిరుపతిలోని పలు ప్రాంతాల నందు పగటిపూట తాళాలు వేసి ఉన్న ఇంటి పరిసరాల వద్ద రెక్కీ నిర్వహించడంతోపాటు.. రాత్రి వేళల ఇంటికి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడే వారిని వివరించారు. కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ చెందిన కృష్ణప్ప రాజేష్, వే దురు కుప్పం మండలం ,మాంబేడు గ్రామానికి చెందిన మొగిలి భాను ప్రకాష్ అలియాస్ భాను 23 సంవత్సరాలు. పట్టంపాడు మండలం చిలుక వారి కండ్రిగ గ్రామానికి చెందిన చందు24 సంవత్సరాలు. సత్య సాయి జిల్లా, నాగల బావి వీధి ధర్మవరం టౌన్ చెందిన నామ్మే అలియాస్ రామాంజనేయులు అలియాస్ సాయి రామ్ 24 సంవత్సరాలు వీరిని అరెస్టు చేశామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement