కర్నూలు (ప్రభన్యూస్): మొదటి డోసు వ్యాక్సిన్ వేయించుకుని రెండవ డోసుకు సమయం దగ్గర పడ్డ వాళ్లందరూ వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలని కలెక్టర్ కోటేశ్వరరావు గురువారం తెలిపారు. రెండవ డోసు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన వారు జిల్లాలో సుమారు 74వేల మంది ఉన్నారన్నారు. వీరందరూ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రెండు, మూడు రోజులలో వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. కరోనా వ్యాక్సిన్ అన్ని గ్రామ, వార్డు సచివాలయాలలో పీహెచ్‌సీ, సీహెచ్‌సీ సెంటర్లలో వేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అర్హులందరూ కరోనా టీకా వేయించుకుని వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇంటింటా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందని ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ ఖచ్చితంగా వేయించుకోవాలన్నారు. వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో 100 శాతం వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తయ్యేటట్లు చూడాలన్నారు.
కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించాలన్నారు. సామాజిక దూరం పాటించడం తరచూ చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత ప్రమాద కరంగా ఉందని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకొని కొవిడ్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital