సీఆర్డీఏ ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు టిడ్కో ఇళ్లను కూడా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ పేర్కొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గృహా నిర్మాణ శాఖపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సీఆర్డీఏ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణ పనులపై సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగే విధంగా కార్యాచరణ రూపొందించాలని సీఎం జగన్ తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలకు సాధ్యమైనంత త్వరగా ఇల్లు కట్టించి అప్పగించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
ఈ సమావేశానికి గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ చైర్మన్ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి. సాయి ప్రసాద్, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె. విజయానంద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై. శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి కె. వి. వి. సత్యనారాయణ, సీసీఎల్ఏ సెక్రటరీ ఏ ఎండీ ఇంతియాజ్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ లక్ష్మీషా, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వీ. జీ. వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.