Saturday, November 23, 2024

వైసీపీ ప్లీనరీ నిర్వహణకు ఏర్పాట్లు, అదే వేదికగా సీఎం జగన్‌ కీలక ప్రకటన..

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రతిపక్ష తెలుగుదేశం మహానాడు నిర్వహణ తరువాత రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. నిన్నటి వరకూ ఫుల్‌ జోష్‌లో ఉన్న తెదేపా తీరును దావోస్‌ పర్యటన నుండి వచ్చిన సీఎం జగన్‌ నిశితంగా పరిశీలించారు. పర్యటన నుండి వచ్చీ రాగానే రాష్ట్ర పరిస్థితులపై తన సన్నిహితులతో ఆరా తీశారు. పార్టీ ముఖ్యుల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం, మంత్రుల బస్సు యాత్ర పైన సీఎం ఆరా తీసారు. ఇక, తాను ప్రజల్లోకి వెళ్లాలని సీఎం జగన్‌ స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు. ఇక వచ్చే నెల 7,8 తేదీల్లో పార్టీ తరపున నిర్వహించబోయే ప్లీనరీ సమావేశాలపై పార్టీ పెద్దలకు ఎస్సైన్‌మెంట్‌ ఇచ్చారు.

దాని ఫలితంగానే ప్లీనరీని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఖాళీస్థంలోనే తిరిగి నిర్వహించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే, ప్లీనరీని అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్వహించాలని సీఎం జగన్‌ పార్టీ ముఖ్యులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. తెలుగుదేశం మహానాడుకు మూడింతలమేర విజయవంతం కావాలన్న తన అభిప్రాయాన్ని సూటిగా, స్పష్టంగా, నిష్కర్షగా పార్టీ ముఖ్యులకు తెలిపారు. దీంతో ఇప్పుడు అధికార వైకాపాలో ప్లీనరీ ఫీవర్‌ ప్రారంభమైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement