గుంటూరు (ప్రభ న్యూస్): ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రి వర్గం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా వెలగపూడి సచివాలయం సమీపంలో నిర్వహించే సభ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కాగా, ముఖ్యమంత్రి అడిషనల్ సెక్రటరీ ముత్యాల రాజు, జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాలరెడ్డి, ఎస్పీ ఆరీఫ్ హాఫీజ్, శాసనమండలి సభ్యులు తలశిల రఘురాం, సంయుక్త కలెక్టర్ జి రాజకుమారి తో కలసి శనివారం పనులను పరిశీలించారు. 11వ తేదీన రాష్ట్ర నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం సభ ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి , రెవెన్యూ డివిజన్ అధికారి ప్రభాకర్ రెడ్డి ఇతర అధికారులకు సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..