Wednesday, November 20, 2024

Arogyasri – ఏ పేదోడు వైద్యం కోసం..అప్పుల పాలు కావొద్దు – జ‌గ‌న్

తాడేప‌ల్లి – ఏ పేదోడు వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదనే తపన, తాపత్రయంతో ఉచితంగా వైద్యం పొందేందుకు ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తీసుకు వచ్చామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో చరిత్రను సృష్టించామని, రూ.5లక్షల వరకూ ఆరోగ్యశ్రీ వైద్య సేవలను రూ.25 లక్షలకు పెంచామని చెప్పారు. తాడేపల్లిలో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్ఫ్లో సీఎం జగన్ మాట్లాడుతూ, తాము అధికారంలోకి రాకముందు 748 హాస్పటిల్స్లో 1059 ప్రొసిజర్స్కు ఆరోగ్యశ్రీ అమలు జరిగిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రొసిజర్స్ను 2000లకు పెంచామని, ఇప్పుడు ఈ ప్రొసిజర్స్ సంఖ్యను 3257కు పెంచామని వివరించారు. వైద్యం కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదనే తపన, తాపత్రయంతో ఆరోగ్యశ్రీ పరిధిని పెంచామని, అదేవిధంగా నెలకు రూ.40వేల జీతం తీసుకునే కుటుంబాలకూ ఆరోగ్యశ్రీ వర్తించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో రాష్ర్టంలో 1.48 కోట్ల కుటుంబాలు, అంటే 4.25 కోట్ల మందికి ఆరోగ్యశ్రీ అనువర్తిస్తుందని వివరించారు.

మరీ ముఖ్యంగా తాము అధికారంలోకి రాక ముందు రాష్ట్రంలో 748 హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు అందేవని, ఇప్పుడు తాము 2513 హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ అమలు జరిగిలా విస్తరించామని, ఇందులో 2309 ఏపీ హాస్పిటల్స్లో, హైదరాబాద్లో 85, బెంగళూరులో 35, చెన్నైలో 19 సూపర్ స్పెషలిస్టు ఆసుప్రతుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందించేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆరోగ్య శ్రీ కోసం ఏటా రూ.4500 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఏపీలోనే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రతి ఎంపీ స్థానంలో ఒక మెడికల్ కాలేజీని నెలకొల్పుతామని వివరించారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యాన్ని అందించటమే కాదు, ఉచిత వైద్యాన్ని ఎలా పొందాలో అవగాహన కల్పిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement