Saturday, November 23, 2024

AP | అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..

కర్నూలు జిల్లా, దేవనకొండ, ప్రభ న్యూస్ : మండల పరిధిలోని పి కోటకొండ గ్రామంలో అప్పుల బాధ తట్టుకోలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మునగాల చిన్న గిడ్డయ్య(38)కు 2 ఎకరాల సొంత పొలం, మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

రెండేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలతో పంటలు పండక, ఈ ఏడాది కూడా వర్షాలు సరిగా కురవకపోవడంతో పంటల పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలనే మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గ్రామానికి చెందిన ప్రవేటు ఆస్పిట‌ల్ కు తీసుకెళ్లారు.. అయితే, చికిత్స పొందుతూ మున‌గాల చిన్న గిడ్డ‌య్య మృతి చెందాడు. కాగా, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement