ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఫిబ్రవరి 22 నుండి నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. భ్రమరాంబా మల్లికార్జునస్వామి దేవస్థానంలో నేటి నుంచి ఆర్జిత సేవలు పున:ప్రారంభం కానున్నాయి. అలాగే భక్తులకు స్వామి స్పర్శదర్శనాన్ని కల్పించనున్నారు. దేవాలయంలో గర్భాలయ అభిషేకం, కుంకుమార్చన, ఆర్జిత సేవలు నేటి నుంచి యధావిధిగా జరుగనున్నాయి. కరెంట్, ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా ఆర్జిత సేవల టికెట్లను భక్తులకు అధికారులు అందుబాటులో ఉంచారు. రేపటి నుంచి రోజుకు మూడుసార్లు స్వామివారికి సామూహిక అభిషేకాలను అర్చకులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement