ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య కొట్లాట జరిగింది. పెద్దారవీడు మండలంలో ఇవ్వాల (ఆదివారం) రాత్రి వివాదం తలెత్తింది. చర్చి విషయంలో జరిగిన చిన్న లొల్లి కాస్త ఘర్షణలకు దారితీసింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
తోకపల్లిలోని ఎస్సీపాలెంలో చర్చి విషయంలో జరిగిన గొడవ కాస్త పరస్పరం దాడులు చేసుకుని కొట్టుకునే దాకా వచ్చింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఇరు వర్గల వారు గొడ్డళ్లు, కర్రలతో అటాక్ చేసుకుని తలలు పగలగొట్టుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. మరో 15 మందికి గాయాలైనట్టు తెలుస్తోంది. కొట్లాటలో గాయపడ్డ వారందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.