Friday, October 18, 2024

Indrakiladri | వైభవంగా మంత్రార్చన !

(ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : వివిధ ఆలయాల అర్చకులు ఏకకంఠంతో జగన్మాత చెంత చేసిన పారాయణం భక్తి జ్ఞానంతో మారుమోగింది. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా వేడుకల్లో భాగంగా శ్రీ మహిషాసుర మర్ధిని అవతారంలో కొలువైన అమ్మవారిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

శ్రీ మల్లికార్జున స్వామి మహామండపంలోని ఆరవ అంతస్తులో శుక్రవారం అర్చకసభ వైభవోపేతంగా జరిగింది. పంచప్రాణాల్లో మొదటిది అర్చకుడి ప్రాణం. నడిచే హరి అర్చకుడు..అంటూ అర్చకులు ఇచ్చిన సందేశం, అర్చక సభలో వారు పాల్గొన్నందుకు వ్యక్తపరిచిన ఆనందంతో సభ సమ్మోహన భరితంగా సాగింది.

వేదాలు, ధర్మాలు, సంప్రదాయాలు, ఆచరించడం, ప్రోత్సహించడం కొనసాగిస్తూనే ఉంటామని ఆలయ ఈవో కెఎస్ రామ రావు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో సనాతన ధర్మ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నామని ఆయన చెప్పారు. ఆధ్యాత్మికతకు, వేదాలకు, విజయవాడ వేదిక అవుతుందని ఈవో ఆకాంక్షించారు.

అర్చక సభ వంటి గొప్ప కార్యక్రమాలు కొనసాగించడానికి దుర్గామాత తమకు శక్తినివ్వాలని రామరావు కోరారు. అర్చక సభలో పాల్గొన్న 175 మంది అర్చకులకు 4,500 రూపాయలు చొప్పున పారితోషకం అందించారు. అర్చక సభకు అధ్యక్షత వహించిన వహించిన వారికి 5000 రూపాయలు పారితోషకం అందించారు. ఈ సభలో ఆలయ కార్యనిర్వాహణాధికారితోపాటు ఆలయ అధికారులు, పండితులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement