విజయవాడ, (ప్రభన్యూస్) : రాష్ట్రంలో 2021-22 విద్యా సంవత్సరానికి గాను అక్టోబరు మొదటి వారంలో ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్దులు డిగ్రీ అడ్మిషన్ కు ఆన్లైన్ ద్వారా కళాశాలలను ఎంపిక చేసుకుని దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. నగరంలో మొత్తం 10, జిల్లాలో 40 వరకు కళాశాలలున్నాయి. ప్రైవేటు కళాశాలల అడ్డగోలుగా అధిక ఫీజులను వసూలుకు చెక్ పెట్టలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఫీజు నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ జిల్లాల్లో పర్యటించి వివిద వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కళాశాలస్థాయి, కోర్సులతో పాటు నగర, పట్టణాలను పరిగణలోకి తీసుకుని డిగ్రీ ఆ్లనన్ ప్రక్రియ ద్వారా సీట్లను భర్తీకి ఏ కళాశాలలో ఎంత ఫీజు ఉండాలి ఏ కోర్సుకు ఎంత ఉండాలి అని ఫీజులను నిర్ధారించారు.
కమిటీ నిర్ణయించిన మేరకు మాత్రమే ఫీజులను వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మెరిట్ ఆధారంగా ఆయా కళాశాల్లో ఉన్న సీట్లను బట్టి విద్యార్దులకు అడ్మిషన్ లెటర్‌ను పంపిస్తారు. అడ్మిషన్ పొందిన విద్యార్దులు ఎలాట్మెంట్ ఆర్డరును తీసుకుని తమకు కేటాయించిన కళాశాలకు వెళ్ళిన విద్యార్దులకు ఫీజుల విషయంలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కొన్ని పేరుగాంచిన కళాశాలలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన మొత్తానికన్నా రెండు మూడు రెట్లు అధికంగా చెల్లించాలంటూ కళాశాల యాజమాన్యం డిమాండ్ చేస్తుడడంతో తల్లిదండ్రులు విస్తుపోతున్నారు. అదేమని అడిగితే తాము అడిగినంత చెల్లిస్తేనే అడ్మిషన్ ఇస్తామని లేకుంటే సీట్లు అయిపోయాయంటూ సమాధానం ఇస్తున్నారంటూ తల్లిదండ్రులు వాపోతున్నారు.
గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital