న్యూడిల్లీ, : దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. దీంతో అమిత్ షా.. ప్రజలకు క్షమాపణలు చెప్పాలని.. అలాగే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు, పాదయాత్రలు సైతం చేపట్టాయి.
ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం తన ఎక్స్ ఖాతా వేదికగా ఎన్డీయే మిత్ర పక్షాలైన తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ (యునైటెడ్) అధినేతలకు ఆయన సూటిగా ప్రశ్నను సంధించారు. దేశ ప్రజలు గౌరవనీయులైన నితీష్ జీ, చంద్రబాబు నాయుడు జీని అడగాలనుకుంటున్నారు – “అమిత్ షా జీ చేసిన బాబా సాహెబ్‌ను అవమానించడాన్ని మీరు సమర్థిస్తారా?” అంటూ ఎక్స్ తన ఖాతా వేదికగా వారిరువురిని మాజీ సీఎం కేజ్రీవాల్ హిందీలో ప్రశ్నించారు.
అలాగే చంద్రబాబు కు పలు విషయాలను ప్రస్తావిస్తూ బహిరంగ లేఖ రాశారు.. అమిత్ షా ఇప్పటి వరకు తన వ్యాఖ్యాలపై క్షమాపణలు చెప్పలేదన్నారు .. దీనిపై మీ స్పందన ఏమిటో చెప్పాలని చంద్రబాబును కోరారు.. ప్రధాని మోదీ సైతం అమిత్ షా నే సమర్ధిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో మీరు లోతుగా ఆలోచించాలని ప్రజలు కోరుతున్నారని వెల్లడించారు.. ఈ ఘటనపై మీ స్పందన తెలీయజేయాలని ఎపి సిఎం ను కేజ్రీవాల్ కోరారు..