Tuesday, November 19, 2024

ఆరణియార్ గేట్లు ఎత్తివేత

చిత్తూరు జిల్లా సత్యవేడులోని అరణియార్ రిజర్వాయర్ నిండు కుండలా మారింది. దీంతో ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయనున్నారు. సోమవారం ఆరణియార్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టులో నీటిమట్టం 30.8 అడుగులకు చేరడం, ప్రస్తుతం వర్షాలు కరుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయనున్న నేపథ్యలో అరుణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నదిలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఇప్పటికే రెవెన్యూ, పోలీసు, ఇతర విభాగాలకు చెందిన అధికారులతో పాటు తమిళనాడు అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. గ్రామాల్లో స్థానిక అధికారులు, వాలంటీర్లు ప్రజలను అప్రమత్తం చేయాలని ఇరిగేషన్ శాఖ విజ్ఞప్తి చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement